Indian Oil Corporation Ltd Has Released Short Notification For The Recruitment Of Graduate Engineer Posts

Indian Oil Corporation Jobs:

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ దేశవ్యాప్తంగా ఉన్న ఐవోసీఎల్‌ రీజియన్లలో గేట్‌-2024 ద్వారా గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుతానికి పత్రిక ప్రకటనను మాత్రమే సంస్థ విడుదల చేసింది. పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ను త్వరలోనే అందుబాటులో ఉంచనున్నారు. సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీతో పాటు గేట్‌-2024 అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. గేట్-2024 స్కోరుతోపాటు ఇంటర్వ్యూ, వైద్య పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

వివరాలు..

* గ్రాడ్యుయేట్ ఇంజినీర్ పోస్టులు

విభాగాలు..

➥ కెమికల్ ఇంజినీరింగ్ 

➥ సివిల్ ఇంజినీరింగ్ 

➥ కంప్యూటర్ సైన్స్ & ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ

➥ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ 

➥ ఎలక్ట్రానిక్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ 

➥ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ 

➥ మెకానికల్ ఇంజినీరింగ్ 

➥ మెటలర్జికల్ ఇంజినీరింగ్.

అర్హత: సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు గేట్‌ 2024 అర్హత సాధించి ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక ప్రక్రియ: గేట్ 2024 స్కోరు, ఇంటర్వ్యూ, వైద్య పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తు తేదీలు: గేట్‌-2024 ఫలితాలు వెల్లడి తర్వాత ఐవోసీఎల్‌ ఆన్‌లైన్ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

WEBSITE

ALSO READ:

నేషనల్‌ బోర్డు ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ ఇన్‌ మెడికల్‌ సైన్సెస్‌‌లో 48 ఖాళీలు
న్యూఢిల్లీలోని నేషనల్‌ బోర్డు ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ ఇన్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎన్‌బీఈఎంస్‌) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి సెప్టెంబరు 30న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. అక్టోబరు 20 వరకు కొనసాగనుంది. కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష/ స్కిల్‌టెస్ట్‌ ద్వారా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

 సాఫ్ట్‌వేర్‌ కోర్సులో ఉచిత ఉపాధి శిక్షణ, ఈ అర్హతలుండాలి
డాక్టర్‌ రెడ్డీస్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని నిరుద్యోగ యువతకు ఫుల్‌స్టాక్‌ డెవలపర్‌ సాఫ్ట్‌వేర్‌ కోర్సులో ఉచిత ఉపాధి శిక్షణ ఇస్తున్నట్లు మేనేజర్‌ రాఘవేందర్‌రావు తెలిపారు. ఈ మేరకు సెప్టెంబరు 29న ఒక ప్రకటలో తెలిపారు. వయసు 20-28 సంవత్సరాల మధ్య ఉన్నవారు దరఖాస్తు చేసుకోడానికి అర్హులు. బీసీఏ, బీఎస్సీ(సీఎస్‌), బీటెక్‌(సీఎస్‌ఈ, ఈసీఈ, ఐటీ) పూర్తిచేసిన వారికి ఫుల్‌స్టాక్‌ డెవలపర్‌ సాఫ్ట్‌వేర్‌ కోర్సులో మూడునెలల పాటు శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలనూ కల్పిస్తామని పేర్కొన్నారు. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

తెలుగు యూనివర్సిటీ కోర్సుల్లో స్పాట్ ప్రవేశాలు
హైదరాబాద్‌లోని పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2023-24 విద్యాసంవత్సరానికి వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం ‘స్పాట్ అడ్మిషన్స్’ నిర్వహిస్తోంది. ఈ మేరకు వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య భట్టు రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. లలితకళా రంగంలో ఎంపీఏ (కూచిపూడి, జానపదం, రంగస్థలం, సంగీతం), సామాజిక తదితర శాస్త్రాల విభాగంలో జ్యోతిషం, ఎంఏ (లింగ్విస్టిక్స్) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు సంబంధిత ధ్రువపత్రాలతో నవంబరు 25లోగా ఆయా వర్సిటీ ప్రాంగణాల్లో సంప్రదించి ప్రవేశాలు పొందవచ్చని వర్సిటీ రిజిస్ట్రార్ తెలిపారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి…

Source link