Indian Startup Venture Debt Shows Flat Growth and Rised 1.23Bn$ Stride Ventures Report | Venture Debt: 1.23 బిలియన్ డాలర్లకు చేరిన వెంచర్ డెట్

Stride Venture Report on Venture Debt: దేశంలో స్టార్టప్ ఇకోసిస్టమ్‌పై  విశ్వాసం పెరుగుతోంది. భారతదేశ వెంచర్ డెట్ మార్కెట్ 2024లో $1.23 బిలియన్లకు చేరుకుంది, 2018 నుండి సంవత్సరానికి 58 శాతం  కాంపౌండ్  వృద్ధి రేటు (CAGR)తో పెరిగింది. నూతన ఆవిష్కరణలు, అద్భుతమైన  ఆలోచనలకు రుణదాతల నుంచి వస్తున్న ప్రోత్సాహం కారణంగా 2024లో ఒప్పందాల సంఖ్య 238కి చేరుకుంది,   2018లో 56 గా ఉన్న ఒప్పందాలు ఆ తర్వాత ఈ స్థాయికి పెరిగాయి.

ప్రపంచ వెంచర్ డెట్ మార్కెట్ 14 శాతం CAGRతో పెరుగుతోంది.

వెంచర్ డెట్ అనేది బలమైన వృద్ధి సామర్థ్యాన్ని చూపించే స్టార్టప్‌లకు రుణదాతలు అందించే ప్రైవేట్ క్రెడిట్. ఏడాదికేడాది.. (Y-o-Y) ఉన్న వృద్ధి ఆధారంగా, ఈ విభాగంలో గ్రోత్ దాదాపు ఫ్లాట్‌గా ఉందని, స్ట్రైడ్ వెంచర్స్ కియర్నీ Kearney సహకారంతో విడుదలైన నివేదిక పేర్కొంది. 2023లో 2.5 శాతం Y-o-Y గ్రోత్‌తో  భారత్‌ వెంచర్ డెట్ $1.2 బిలియన్లుగా ఉంది . వెంచర్ క్యాపిటల్ విభాగంలో ఖర్చు పెరుగుతున్నందున.. వెంచర్ డెట్ విభాగంలో గ్రోత్ ఫ్లాట్‌గా ఉంది.  భారతదేశ వెంచర్ క్యాపిటల్ మార్కెట్ 2024లో 20 శాతం Y-o-Y పెరుగుదలతో $12 బిలియన్లకు చేరుకుంది.

‘గ్లోబల్ వెంచర్ డెట్ రిపోర్ట్’ నాల్గవ ఎడిషన్ ప్రకారం, వెంచర్ డెట్ మార్కెట్ ఇప్పుడు న్యూట్రల్ నుండి గ్రోత్ దిశగా పయనిస్తోంది. 39 శాతం  భాగస్వాములు గణనీయమైన వృద్ధి కొనసాగిస్తున్నారు.  అదే సమయంలో ఎగ్జిట్ ట్రెండ్ కూడా ఎక్కువుగానే ఉంది.

భారతదేశ వెంచర్ ఎగ్జిట్‌లు 2023లో 1.7 రెట్లు పెరిగి $6.6 బిలియన్లకు చేరుకున్నాయి, ఇందులో 55 శాతం ఎగ్జిట్‌లు పబ్లిక్ మార్కెట్ అమ్మకాల ద్వారా జరిగాయి. వెంచర్ డెట్ సహాయంతో ఉన్న స్టార్టప్‌లు 2024లో సగటున $81.2 మిలియన్ల ఈక్విటీ ఫండింగ్ సేకరించాయి.

స్ట్రైడ్ వెంచర్స్ వ్యవస్థాపకుడు ,మేనేజింగ్ పార్టనర్ ఇష్‌ప్రీత్ సింగ్ గాంధీ మాట్లాడుతూ, “భారతదేశ వెంచర్ డెట్ మార్కెట్ ఆరు సంవత్సరాల క్రితం నామమాత్రంగా ఉన్నది 2024లో $1.23 బిలియన్లకు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా వెంచర్ డెట్ 14 శాతం CAGRతో పెరుగుతోంది, ఇది ఒక కిందిస్థాయి నుండి ప్రధాన ఆస్తి తరగతిగా అభివృద్ధి చెందుతోంది, ఎంటర్‌ప్రెన్యూర్స్‌  స్థిరంగా వృద్ధి చెందేందుకు ఇది తోడ్పడుతోంది.   అభివృద్ధి చెందుతున్న మరియు అభివృద్ధి చెందిన ఇకోసిస్టమ్‌లలో వెంచర్‌ డెట్ ఏ విధమైన పాత్ర పోషిస్తోందన్న విషయాన్ని మేం వ్యూహాత్మకంగా పరిశీలిస్తున్నాం.” అని అన్నారు.

నివేదిక ప్రకారం, వెంచర్ డెట్‌కు బలమైన వృద్ధి సామర్థ్యం ఉన్న రంగాలు కన్స్యూమర్ (77 శాతం), ఫిన్‌టెక్ (46 శాతం), మరియు క్లీన్‌టెక్ (33 శాతం).

ఒప్పంద విలువ పరంగా, ఫిన్‌టెక్ 2024లో $447 మిలియన్ల మొత్తంతో 49 ఒప్పందాలతో ముందంజలో నిలిచింది. మరోవైపు, కన్స్యూమర్ రంగం 81 ఒప్పందాలతో అత్యధిక వెంచర్ డెట్ లావాదేవీలను చూసింది, ఇందులో $295 మిలియన్ల  విలువైన ఒప్పందాలు జరిగాయి. క్లీన్‌టెక్ రంగంలో  $202 మిలియన్లు విలువైన 22 ఒప్పందాలు కుదిరాయి.

 వెంచర్ డెట్‌ను ప్రభావితం చేస్తున్న  కొన్ని ప్రధానమైన అంశాలు వర్కింగ్ క్యాపిటల్ (52 శాతం), వృద్ధి ఫైనాన్సింగ్ (44 శాతం), మరియు రన్‌వే ఎక్స్‌టెన్షన్ (43 శాతం).

మెట్రో నగరాల్లో విస్తరణ

వెంచర్ డెట్ మార్కెట్ మెట్రోపాలిటన్ నగరాల్లో స్థిరపడుతోంది. బెంగళూరు $485.5 మిలియన్లతో 80 ఒప్పందాలతో అత్యధిక వెంచర్ డెట్ ఫండింగ్‌ను పొందింది. దాని తర్వాత ముంబై $244.6 మిలియన్లతో (42 ఒప్పందాలు), ఢిల్లీ NCR $242.5 మిలియన్లతో (69 ఒప్పందాలు) ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా, వెంచర్ డెట్ ఒప్పందాల విలువ 2018లో $37.9 బిలియన్ల నుండి 2024లో $83.4 బిలియన్లకు పెరిగింది.యునైటెడ్ స్టేట్స్ , యూరప్ వంటి మార్కెట్లలో, వెంచర్ డెట్ ప్రస్తుతం మొత్తం వెంచర్ క్యాపిటల్ ఫండింగ్‌లో 20-30 శాతం వాటాను కలిగి ఉందని నివేదిక పేర్కొంది.

 

మరిన్ని చదవండి

మరిన్ని చూడండి

Source link