Indias first 410 meter Hyperloop test track developed by IIT Madras : మారుతున్న కాలంతో పరుగులు పెట్టేలా.. లాజిస్టిక్స్ కూడా కళ్లు మూసి తెరిచేంతలోగానే డెలివరీ అయిపోవాలని కోరుకుంటున్నారు. అది మనుషుల ప్రయాణం అయినా వస్తువుల చేరవేత అయినా అంతే. అందుకే బుల్లెట్ ట్రైన్స్ వంటి వాటికి ఆదరణ పెరుగుతోంది.హైపర్ లూప్ అనే టెక్నాలజీతో బుల్లెట్ ట్రైన్ కన్నా వేగవంతమైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. దీన్ని మన దేశంలో మొదటి సారి టెస్ట్ ట్రాక్ రెడీ చేశారు.
ఐఐటీ మద్రాస్,భారత్ రైల్వేలు, ఇతర స్టార్టప్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న భారత్ తొలి హైపర్‌లూప్ టెస్ట్ ట్రాక్ ను సిద్ధం చేశారు. ఐఐటీ చెన్నైలోని తైయూర్ క్యాంపస్‌లో 410 మీటర్ల హైపర్‌లూప్ టెస్ట్ ట్రాక్ గురించి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ బయట ప్రపంచానికి తెలిపారు. రత్ తొలి హైపర్‌లూప్ టెస్ట్ ట్రాక్ 410 మీటర్లు పూర్తయిందని.. రైల్వేస్, ఐఐటీ-మద్రాస్ ఆవిష్కార్ హైపర్ లూప్ బృందం కృషి చేసిందని తెలిపారు. ఓ స్టార్టప్ సంస్థ భాగస్వామ్యంలో ఈ హైపర్ లూప్‌ను నిర్మించారు.
Watch: Bharat’s first Hyperloop test track (410 meters) completed.
👍 Team Railways, IIT-Madras’ Avishkar Hyperloop team and TuTr (incubated startup)
📍At IIT-M discovery campus, Thaiyur pic.twitter.com/jjMxkTdvAd
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) December 5, 2024
Also Read: మరో 50 ఏళ్లలో అంతరించిపోనున్న సగం దేశాలు – ఎలాన్ మస్క్ హెచ్చరిక – ఇది వంద శాతం నిజం !
హైపర్ లూప్ అనేది ఓ ప్రత్యేక నిర్మాణంగా చెప్పవచ్చు. బాహ్యంగా అంటే రైలు మార్గంపై గానీ రైలుకు వెలుపల గానీ ఎటువంటి గాలి అసలుండదు. ఈ హైపర్ లూప్ వాక్యూం రూపంలో ఉన్న గొట్టాలలో ప్రయాణిస్తుంది. దీని కారణంగా దాని మీద ఏరోడైనమిక్ ప్రభావం ఉండదు. అంటే ఏ విధమైన బాహ్యపరమైన ఒత్తిడి రైలుపై గానీ దాని వేగంపై గానీ ప్రభావం చూపే అవకాశం లేదు. ఈ కారణంగానే హైపర్ లూప్ టెక్నాలజీలో రైలు అత్యంత వేగంగా ప్రయాణిస్తుంది. సాధారణంగా భూమిపై ప్రయాణించే వాహనాలకు గాలి అనేది పెద్దగా ఆటంకం. దానివల్ల అవి ఒక పరిమితికి మించిన వేగంతో రోడ్డుపై వెళ్లడం సాధ్యంకాదు. కానీ గాలి పీడనం బాగా తక్కువగా ఉండే హైపర్ ల్యూబ్ ట్యూబ్‌లోకి బోగీని ప్రవేశపెడితే, దాని వేగంగావెళ్లొచ్చు. ఈ హైపర్‌లూప్ ఈ పద్దతిపై ట్రయల్ రన్ చేస్తారు.
Also Read: ఐఏఎస్‌కు రిజైన్ చేసి యూట్యూబ్ చానల్ పెట్టాడు – అందరూ పిచ్చోడనుకున్నారు కట్ చేస్తే రూ.26వేల కోట్ల కంపెనీకి ఓనర్ – రోమన్ సైనీ గురించి విన్నారా ?
హైపర్‌లూప్ రైలు లేదా కారు ప్రయాణం కంటే చౌకగా మరియు వేగవంతమైనది అవుతుంది. విమాన ప్రయాణం కంటే చౌకగా మరియు తక్కువ కాలుష్యకారకం. సాంప్రదాయ హై-స్పీడ్ రైలు కంటే ఇది చౌకగా ఉంటుంది. రోడ్లపై ఒత్తిడిని తగ్గించడానికి, నగరాల మధ్య ప్రయాణాన్ని సులభతరం చేయడానికి బాగా ఉపయోగపడుతంది.టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ కూడా ఈ హైపర్ లూప్ విధానంపై పరిశోధనలు చేయిస్తున్నారు. ఈ విషయంలో మన దేసంలోఓ అడుగు ముందుకు వేసిందని అనుకోవచ్చు.
మరిన్ని చూడండి