Indonesia Bodybuilder:
ఇండోనేషియా బాడీ బిల్డర్ మృతి
ఫిట్నెస్ కోసం అవసరానికి మించి వ్యాయామం చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు కొందరు. జిమ్‌లోనే ఎక్స్‌ర్‌సైజ్ చేస్తూ హార్ట్‌అటాక్‌తో చనిపోయిన ఘటనలు ఈ మధ్య కాలంలో వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇండోనేషియాలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. 33 ఏళ్ల జస్టిన్ విక్కీ (Justyn Vicky) ఫేమస్ బాడీ బిల్డర్. సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. అయితే…జులై 15న జిమ్‌లో రోజూలాగే వ్యాయామం చేస్తున్నాడు. మెడపై 450 పౌండ్లకు మించిన బరువుని మోసేందుకు ప్రయత్నిస్తుండగా ఉన్నట్టుండి అది అదుపు తప్పింది. అంత బరువు ఒకేసారి పడడం వల్ల మెడ విరిగిపోయింది. స్క్వాట్స్ చేస్తుండగా వీడియో కూడా తీశారు. ఆ వెయిట్ అంతా మెడపై పడి అక్కడికక్కడే కుప్ప కూలిపోయాడు. వెంటనే హాస్పిటల్‌కి తరలించారు. సర్జరీ చేసినప్పటికీ ప్రాణాలు దక్కలేదు. ఫిట్నెస్ విషయంలో చాలా మంది స్ఫూర్తిగా నిలిచిన జస్టిన్ విక్కీ ఇలా ప్రాణాలుకోల్పోవడం సంచలనం కలిగించింది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మంచి ఫాలోయింగ్ ఉన్న జస్టిన్ చాలా మందిని ప్రోత్సహించేవాడట. ఆయన చనిపోయాడని తెలిసినప్పటి నుంచి చాలా మంది తీవ్ర ఆవేదనతో పోస్ట్‌లు పెడుతున్నారు. ఆయన కేవలం ఫిట్నెస్ ఎక్స్పర్ట్ మాత్రమే కాదని, అంతకు మించి గొప్ప వ్యక్తి అని ట్వీట్లు చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో జస్టిన్‌కి 30వేల ఫాలోవర్స్ ఉన్నారు. న్యూట్రిషన్, వెయిట్ లాస్ కోచ్‌గా పాపులర్ అయ్యాడు. గత వారమే ఐస్ బాత్ గురించి చేసిన పోస్ట్ వైరల్ అయింది. జస్టిన్ నవ్వుని ఎప్పటికీ మరిచిపోలేమని స్నేహితులు చాలా ఎమోషనల్ అవుతున్నారు.
Bodybuilder Justyn Vicky dead at 33 after 400-pound weight breaks neck 🥹🥹 Full Video pic.twitter.com/4NAM2JWHxz
— Sweet❤️ (@Sweetbobo01) July 22, 2023