Insane scene on reality TV Spanish show star Montoya girlfriend drama shocks global audience | Viral News: అది అడవిలో జంటలుగా గడిపాల్సిన బిగ్ బాస్ షో – అక్కడో ఘోరం జరిగిపోయింది

Insane scene on reality TV Spanish show :  ఓ  ఇల్లు ఉంటుంది. అందులోకి పదో.. పదిహేను మందో పోటీదారుల్ని పంపుతారు. కలిసి ఉండమంటారు. ఫోన్లు సహా ఏమీ ఉండవు. ప్రతి ఒక్కరి కదలికలు.. బాత్ రూంలో ఉన్న సమయం మినహా అన్ని కదలికలు రికార్డు చేస్తారు. ఇది మనకు తెలిసిన బిగ్ బాస్ షో. కానీ ఇతర దేశాల బిగ్ బాస్‌లు చాలా అడ్వాన్సుడుగా ఉంటాయి. ఓ బీచ్ ఒడ్డున అడవిలో బిగ్  బాస్ ఇంటిని నిర్మించి అక్కడ ప్రేమికుల జంటల్ని వదిలి పెట్టే షో స్పానిష్ లో  ఉంది. ఇందులో జరిగిన ఓ ఘటన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.  

స్పానిష్ టీవీ షోల్లో నటించే మెంటాయా అనే నటుడుకి మంచి ఇమేజ్ ఉంది. అతనికో గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఇద్దరూ కలిసి ఈ బిగ్ బాగ్ షోలో పార్టిసిపేట్ చేశారు. ఇలా మరికొన్ని జంటలు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ ఎలాంటి ఇతర పనులు చేయకూడదు. చేస్తే రికార్డవుతుంది. వఎంజాయ్ చేయవచ్చు. ఇలా అందరూ హాయిగా కలసి మెలిసి ఉన్న సమయంలో ఓ రోజు.. మెంటాయా..  తన గర్ల్ ఫ్రెండ్ కాకండా మరో అమ్మాయి రాత్రి పూట అలా షికారుకు వెళ్లారు. విషయం ఏమిటంటే.. ఇంట్లో ఏం జరుగుతుందో తెలిసేందుకు వారు తిరిగే చోట టీవీలుకూడా పెడతారు. అలా వీరు వెళ్లిన సమయంలో ఓ టీవీ ఉంది. 

Also Read: ఈ వీధిలోకి షాపింగ్‌కు వెళ్తే కనీసం రూ.2 లక్షలు ఖర్చు ఖాయం – ప్రపంచంలో అత్యంత కాస్ట్‌లీ షాపింగ్ స్ట్రీట్ ఏదో తెలుసా ?

ఓ సీసీ టీవీ ఫుటేజీ చూసి అతనికి మైండ్ బ్లాంక్ అయింది. తన గర్ల్ ఫ్రెండ్ ఉన్న గదిలోకి మరో మేల్ కంటెస్టెంట్ వెళ్లాడు. వెళ్తే ఏముందిలే అనుకోవడం లేదు.. ఇద్దరూ కలిసి గేమ్ ప్రారంభించారు. ఆ గేమ్ చూసి మెంటాయా తట్టుకోలేకపోయాడు. పరుగులు పెట్టి ఇంట్లోకి వెళ్లాడు. కానీ  ఆ గేమ్ కంప్లీట్ అయ్యే వరకూ వాళ్లు తలుపులు తీయలేదు. దాంతో మెంటాయాకు ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. 

 



మెంటాయాకు ఆమె నిజంగానే గర్ల్ ఫ్రెండ్. జీవితాంతం తనతోనే ఉంటుదంనుకున్న మెంటాయో.. తను కాసేపు పక్కన లేకపోవడంతో చేసిన పని చూసి మైండ్ బ్లాంక్ అయిపోయింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం మెంటాయా అంతకు ముందు మరో కాంటెస్టెంట్ తో కలిసి ల్యాబ్ డాన్స్ చేశాడని అతనికి అలా జరగడంలో.. అతని గర్ల్ ఫ్రెండ్ అలా చేయడంలో తప్పు లేదని కామెంట్స్ పెడుతున్నారు.         

Also Read: ఇన్‌ఫోసిస్, ఎల్ అండ్ టీ పెద్దలనుకుంటే వాళ్ల తాత ఎలాన్ మస్క్ – వారానికి 120 గంటలు పని చేయాలట !

 

మరిన్ని చూడండి

Source link