institute of banking personnel selection has released ibps po Final results check direct link here

IBPS PO Results: దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో)/మేనేజ్‌మెంట్ ట్రెయినీ (ఎంటీ) పోస్టుల (CRP – PO/MT -XIII)  భర్తీకి సంబంధించిన తుది ఫలితాలను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్) ఏప్రిల్ 1న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్ లేదా రోల్ నెంబర్, పాస్‌వర్డ్ లేదా పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి తుది ఫలితాలు చూసుకోవచ్చు. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు నిర్వహించిన మెయిన్స్ పరీక్ష, ఇంటర్వ్యూ మార్కుల ఆధారంగా అభ్యర్థుల తుది ఫలితాలను ఐబీపీఎస్ విడుదల చేసింది. 

IBPS PO తుది ఫలితాలు ఇలా చూసుకోండి..

Step 1: ఫలితాల కోసం అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. ibps.in

Step 2: అక్కడ హోంపేజీలో కనిపించే ‘Recent CRP Updates’ సెక్షన్‌లో కనిపించే ‘Combined Result for Online Main Examination & Interview’ లింక్ మీద క్లిక్ చేయాలి. 

Step 3: క్లిక్ చేయగానే ఫలితాలకు సంబంధించిన పేజీ ఓపెన్ అవుతుంది.

Step 4:  వచ్చే లాగిన్ పేజీలో అభ్యర్థులు తమ వివరాలు నమోదుచేయాలి. 

Step 5: వివరాలు నమోదుచేసి సబ్‌మిట్ చేయగానే అభ్యర్థుల తుది ఫలితాలు కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపిస్తాయి.

 Step 6: ఫలితాలు డౌన్‌‌లోడ్ చేసుకొని, ప్రింట్ తీసుకోవాలి.

IBPS PO – Combined Result for Online Main Examination & Interview

Notification Provisional Allotment under CRP-PO-MTS-XIII 

పెరిగిన ఖాళీల సంఖ్య..
ఐబీపీఎస్ మొదట 3049 పీవో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఆ సమయంలో కొన్ని బ్యాంకులు ఖాళీల వివరాలను సమర్పించలేదు. తాజాగా అన్ని బ్యాంకులు ఖాళీల వివరాలు సమర్పించగా.. మొత్తం పోస్టుల సంఖ్య 5532కి చేరింది. 

బ్యాంకుల వారీగా ఖాళీల వివరాలు:

➥  బ్యాంక్ ఆఫ్ బరోడా: 800 పోస్టులు

➥ బ్యాంక్ ఆఫ్ ఇండియా: 222

➥ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర: 867

➥ కెనరా బ్యాంక్: 747

➥ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: 1974

➥ ఇండియన్ బ్యాంక్: 211

➥ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్: 295 

➥ పంజాబ్ నేషనల్ బ్యాంక్: 313

➥ పంజాబ్ సింధ్ బ్యాంక్: 103

గతంలో ప్రకటించిన ఖాళీల వివరాలు..
IBPS: ఐబీపీఎస్ పీవో తుది ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే

 

 

 

 

 

 

 

 

ప్రస్తుత ఖాళీలు..

IBPS: ఐబీపీఎస్ పీవో తుది ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే

 

 

 

 

 

 

 

దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో)/మేనేజ్‌మెంట్ ట్రెయినీ (ఎంటీ) పోస్టుల భర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్) సెప్టెంబరు 30న నోటిఫికేషన్ (సీఆర్‌పీ-పీవో XIII) విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ సెప్టెంబరు 23, 30; అక్టోబరు 1న ‘ప్రిలిమ్స్’ పరీక్షను నిర్వహించింది. పరీక్ష ఫలితాలను అక్టోబరు 18న విడుదల చేసింది. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు నవంబరు 5న మెయిన్స్ పరీక్ష నిర్వహించారు. జనవరి 30న మెయిన్స్ ఫలితాలను విడుదల చేశారు. మెయిన్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో ఇంటర్వ్యూలు నిర్వహించి.. తాజాగా తుది ఎంపిక ఫలితాలను ఐబీపీఎస్ విడుదల  చేసింది. మొత్తం 5532 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు.

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి

Source link