Iranian Fishing Vessel Attacked By Pirates Indian Navy Rescues 23 Pak Nationals

 Indian Navy Rescues Iranian Vessel: అరేబియా సముద్రంలో ఇరాన్‌కి చెందిన వెజెల్‌పై దొంగలు దాడి చేశారు. అందులో మొత్తం 23 మంది పాకిస్థానీలు బందీ అయ్యారు. దాదాపు 12 గంటల పాటు అలా నడి సముద్రంలోనే చిక్కుకుపోయారు. ఈ సమాచారం అందుకున్న ఇండియన్ నేవీ వెంటనే అప్రమత్తమైంది. ఆ ఇరాన్‌ వెజెల్‌తో పాటు 23 మంది పాకిస్థానీలను కాపాడింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ఆధారంగా  Iranian Fishing Vessel ని సముద్రపు దొంగల బారి నుంచి కాపాడినట్టు భారత నేవీ వెల్లడించింది. 

“ఇరాన్‌కి చెందిన వెజెల్‌ అరేబియా సముద్రంలో చిక్కుకుపోయింది. సముద్రపు దొంగలు దాడి చేసి 23 మంది పాకిస్థాన్‌కి చెందిన సిబ్బందిని బంధించారు. మార్చి 28న సాయంత్రం ఈ ఘటన జరిగింది. ఇండియన్ నేవీకి చెందిన రెండు ఓడల్ని మొహరించాం. హైజాక్ అయిన ఆ వెజెల్‌ని కాపాడాం. అందులోని 23 మంది సిబ్బంది కూడా సురక్షితంగా  బయటపడ్డారు”

– భారత నేవీ 

దాదాపు 12 గంటల పాటు సముద్రపు దొంగలు సిబ్బందిని ఇబ్బంది పెట్టారు. షిప్‌ని కాపాడిన తరవాత పూర్తిగా శానిటైజ్ చేసినట్టు ఇండియన్ నేవీ వెల్లడించింది. మార్చి 29వ తేదీన INS Sumedha ఈ ఆపరేషన్ నిర్వహించింది. సముద్రంలో చిక్కుకున్న Al-Kambar వెజెల్‌ని కాపాడింది. INS Trishul కూడా ఈ ఆపరేషన్‌లో పాల్గొంది. 

మరిన్ని చూడండి

Source link