Is Ajith taking the light అజిత్ ను లైట్ తీసుకుంటున్నారా


Thu 30th Jan 2025 10:23 AM

ajith  అజిత్ ను లైట్ తీసుకుంటున్నారా


Is Ajith taking the light అజిత్ ను లైట్ తీసుకుంటున్నారా

కొన్నాళ్లుగా అజిత్ సినిమాలు తెలుగు ప్రేక్షకులను అంతగా ఇంప్రెస్స్ చెయ్యడం లేదు. అజిత్ కి తెలుగులో మార్కెట్ కూడా పెద్దగా లేదు. అజిత్ సినిమాలు తెలుగులో డబ్ అయ్యి ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా అలా వచ్చి ఇలా వెళ్లిపోతున్నాయి. ఇప్పుడు రాబోతున్న అజిత్ పట్టుదల చిత్రం కూడా అలానే ఉంటుంది అని ఫిక్స్ అవుతున్నారు కొందరు. 

అందుకే అజిత్ పట్టుదలను టాలీవుడ్ జనాలు లైట్ తీసుకుంటున్నారు అనేది కొంతమందిలో మొదలైన అనుమానం. అజిత్ పట్టుదలతో ఫిబ్రవరి 6 న విడుదలకాబోతుంది. ఆ నెక్స్ట్ డే అంటే ఫిబ్రవరి 7 న నాగ చైతన్య తండేల్ చిత్రం తెలుగు తమిళంలో విడుదలవుతుంది. తండేల్ పై భారీ అంచనాలు కనిపిస్తున్నాయి. 

ఆడియన్స్ లో కూడా తండేల్ పై ఆసక్తి కనిపిస్తుంది కానీ.. అజిత్ పట్టుదలపై అంతగా బజ్ అయితే లేదు. అజిత్ ఎలాగూ ప్రమోషన్స్ కు రాడు. మరి పట్టుదల విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ వస్తే తప్ప తండేల్ ధాటిని తట్టుకోవడం కష్టమే. చూద్దాం అజిత్ పెరఫార్మెన్స్ ఎలా ఉండబోతుందో అనేది. 


Is Ajith taking the light:

Ajith Pattudala movie release Feb 6th





Source link