Jain Temple In Shimla Bans Entry Of Devotees With Mini-skirts, Shorts | షార్ట్‌లు మినీ స్కర్ట్‌లు వేసుకుని వస్తే ఆలయంలోకి అడుగు పెట్టనివ్వం

Jain Temple Rules: 

జైన మందిరంలో ఆంక్షలు..

షిమ్లాలోని వందేళ్ల చరిత్ర ఉన్న జైన మందిర యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. షార్ట్‌లు, మినీ స్కర్ట్‌లు వేసుకుని వస్తే అనుమతించమని తేల్చి చెప్పింది. కురచ దుస్తులపై నిషేధం విధించింది. హిందూ సంప్రదాయం ప్రకారం నిండుగా దుస్తులు వేసుకుని వచ్చినా వాళ్లనే అనుమతిస్తామని వెల్లడించింది. మందిరానికి పద్ధతిగానే రావాలని స్పష్టం చేసింది. ఈ డ్రెస్‌కోడ్‌కి సంబంధించి ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేసింది. మందిరం బయటే ఈ నోటీసులు అంటించింది. శ్రీ దిగంబర్ జైన్ సభ నేతృత్వంలో ఈ ఆలయం నడుస్తోంది. 

“ఈ మందిరానికి వచ్చే మహిళలు, పురుషులు పద్ధతిగా డ్రెస్‌లు వేసుకుని రావాలి. కురచ దుస్తులు, షార్ట్‌లు, మినీ స్కర్ట్‌లు, నైట్‌సూట్‌లు, టార్న్ జీన్స్, ఫ్రాక్‌లు, జీన్స్‌లు..ఇలా ఏది పడితే అది వేసుకుని వస్తే లోపలకి అనుమతించం. ఇలాంటివేవైనా ఆలయం బయటే వేసుకోండి. ఇక్కడికి వస్తే మాత్రం పద్ధతిగానే ఉండాలి. హిందూ సంప్రదాయాన్ని రక్షించడంలో భాగందానే ఈ నిర్ణయం తీసుకున్నాం. మనకంటూ కొన్ని విలువలున్నాయి. వాటిని కాపాడుకోవాలన్నదే మా ఉద్దేశం. “

– ఆలయ నిర్వాహకులు 

సంస్కృతిని గౌరవించండి..

అసలు ఈ రోజుల్లో ఆలయాలను సందర్శించడమే ప్రజలు మర్చిపోతున్నారని అసహనం వ్యక్తం చేశారు జైన మందిర నిర్వాహకులు. మన సంస్కృతి, సంప్రదాయాలపై ఎలాంటి ఆసక్తి చూపించడం లేదని మండిపడ్డారు. మన ముందు తరం వాళ్లు తప్పకుండా ఆలయాలకు వెళ్లే వాళ్లని, నిండైన దుస్తులు ధరించే వాళ్లని చెప్పారు. కానీ…ఇప్పుడు చాలా మంది కురచ దుస్తులతో ఆలయాలకు వస్తుండటం అసహనానికి గురి చేస్తోందని అన్నారు. పాశ్చాత్య సంస్కృతిని పక్కన పెట్టి మన మతాచారాలను గౌరవించాలని సూచించారు. 

హౌజింగ్ సొసైటీలో డ్రెస్ కోడ్..

గ్రేటర్ నోయిడాలోని ఓ వెల్ఫేర్ అసోసియేషన్ తీసుకున్న నిర్ణయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కామన్ ఏరియాల్లో తిరిగేటప్పుడు కాస్త పద్ధతిగా డ్రెసింగ్ చేసుకోవాలని ఆదేశించింది. హిమ్‌సాగర్ అపార్ట్‌మెంట్‌లో ఈ రూల్ పెట్టారు. జూన్ 10వ తేదీన ఇందుకు సంబంధించి ఓ సర్క్యులర్ కూడా జారీ చేశారు. చాలా మంది పార్కింగ్, కామన్ ఏరియాల్లో పురుషులు లుంగీలతో, మహిళలు నైటీలతో తిరుగుతుండటం సొసైటీ గమనించింది. ఇకపై ఇంకెప్పుడూ అలా కనిపించకూడదని తేల్చి చెప్పింది. ఈ విషయం అక్కడితో ఆగలేదు. ఈ సర్క్యులర్‌ని ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వెంటనే వైరల్ అవడమే కాదు…పోలీసుల వరకూ వెళ్లింది వ్యవహారం. నెటిజన్లైతే తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. “పర్సనల్ ఛాయిస్‌ ఉండదా” అని తిట్టి పోస్తున్నారు. డ్రెస్‌ కోడ్ పేరుతో విడుదల చేసిన ఆ సర్క్యులర్‌ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

Also Read: Viral Video: హాస్పిటల్ లిఫ్ట్‌లోకి స్కూటర్, వీల్‌ఛైర్ లేదని కొడుకుని ఇలా తీసుకెళ్లాడు – వైరల్ వీడియో

Source link