jammu kashmir assembly elections 2024 3rd phase voting news updates bjp congress pdp nc vvip know all about jk assembly election 2024 | Jammu Kashmir 3rd Phase Voting: జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌

Jammu Kashmir Elections 3rd Phase Voting: జమ్ము కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు ముగింపు దశకు చేరుకున్నారు. ఇవాళ ఆఖరి విడత పోలింగ్ నడుస్తోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు జరగనుంది. మొత్తం 7 జిల్లాల్లోని 40 స్థానాలకు ఆఖరి దశలో పోలింగ్ నడుస్తోంది. ఈ స్థానాల్లో ఇద్దరు డిప్యూటీ సీఎంలు సహా 415 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 

7 జిల్లాల్లో 5060 పోలింగ్ బూత్‌లలో 39.18 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ ఎన్నికల కోసం 20 వేల మందికిపైగా ఎన్నికల సంఘం మోహరించింది. జమ్మూ ప్రాంతంలోని జమ్మూ, ఉదంపూర్, సాంబా, కథువా, ఉత్తర కాశ్మీర్‌లోని బారాముల్లా, బండిపోరా, కుప్వారా స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఓటింగ్‌కు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. సెప్టెంబర్ 18న జరిగిన మొదటి దశలో 61.38 శాతం ఓటింగ్ నమోదైంది. సెప్టెంబర్‌ 26న జరిగిన రెండో దశలో 57.31 శాతం ఓటింగ్ రిజిస్టర్ అయింది. 

2019 ఆగస్టులో రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత జమ్ము, కాశ్మీర్‌లో జరుగుతున్న మొదటి అసెంబ్లీ ఎన్నికలు ఇవి. వీటి ఫలితాలు అక్టోబర్ 8న విడుదల కానున్నాయి. ఇప్పుడు చివరి దశలో జరిగే నియోజకవర్గాలు జమ్మూ ప్రాంతంలో 24 సీట్లు ఉంటే… కాశ్మీర్ లోయ 16 సీట్లు ఉన్నాయి. 40 స్థానల కోసం 5,060 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో 50 పోలింగ్ కేంద్రాలను పింక్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 43 పోలింగ్‌ కేంద్రాల్లో ప్రత్యేక వికలాంగుల కోసం సిద్ధం చేశారు. సరిహద్దు నివాసితుల కోసం నియంత్రణ రేఖ సమీపంలో 29 పోలింగ్ స్టేషన్లలో ప్రజలు ఓటు వేస్తున్నారు. 

ఈ దశలో పీపుల్స్ కాన్ఫరెన్స్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి సజ్జాద్ లోన్, నేషనల్ పాంథర్స్ పార్టీ ఇండియా ప్రెసిడెంట్ దేవ్ సింగ్ వంటి ప్రముఖ నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. లోన్ కుప్వారాలోని రెండు స్థానాల నుంచి, సింగ్ ఉదంపూర్‌లోని చెనాని స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. మాజీ మంత్రులు రామన్ భల్లా (ఆర్ఎస్ పురా), ఉస్మాన్ మజీద్ (బందిపోరా), నజీర్ అహ్మద్ ఖాన్ (గురేజ్), తాజ్ మొహియుద్దీన్ (ఉరీ), బషరత్ బుఖారీ (వాగూరా-క్రీరీ), ఇమ్రాన్ అన్సారీ (పట్టన్), గులాం హసన్ మీర్ (గుల్మార్గ్), చౌదరి లాల్ సింగ్ (బసోహ్లీ), రాజీవ్ జస్రోటియా (జస్రోటా), మనోహర్ లాల్ శర్మ (బిలావర్), షామ్ లాల్ శర్మ, అజయ్ కుమార్ సధోత్రా (జమ్మూ నార్త్), ములా రామ్ (మద్), చంద్ర ప్రకాష్ గంగా, మంజీత్ సింగ్ (విజాపూర్) తదితరులు పోరులో ఉన్నారు.

Also Read: “హార్న్ ఓకే ప్లీజ్” వెనుక ఇంత కథ ఉందా? మహారాష్ట్రలో ఈ పదాన్ని బ్యాన్ చేయడానికి కారణం తెలుసా?

మరిన్ని చూడండి

Source link