ByGanesh
Wed 29th Jan 2025 10:00 AM
దేవర చిత్రంతో సౌత్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్.. ఇప్పుడు రామ్ చరణ్ తో RC 16 లో స్క్రీన్ షేర్ చేసుకుంటూ క్రేజీగా మారింది. దేవర చిత్రంలో తంగం పాత్రలో క్యూట్ గా పల్లెటూరి అమ్మాయిలా కనిపించిన జాన్వీ కపూర్.. RC 16 లో ఎలాంటి పాత్రలో కనిపించబోతుంది, ఏ లుక్ లో కనిపిస్తుంది అనే క్యూరియాసిటీ అభిమానుల్లో కనిపిస్తుంది.
సోషల్ మీడియాలో యాక్టీవ్ గా గ్లామర్ ఫొటోస్ ని షేర్ చేసే జాన్వీ కపూర్ తాజాగా కత్తిలాంటి లుక్ షేర్ చేసింది. బ్లాక్ బాడికాన్ డ్రెస్ లో అందాలు చూపిస్తూ జాన్వీ కపూర్ రెచ్చిపోయింది. సోషల్ మీడియాలో అందాలు చూపించడంలో జాన్వీ కపూర్ వేరే చెప్పాలి. గ్లామర్ షోకి అస్సలు అడ్డు చెప్పదు.
కానీ జాన్వీ కపూర్ చేసే పాత్రలు మాత్రం గ్లామర్ కు ఆమడదూరంలో ఉంటాయి. అంత చక్కటి పాత్రలు జాన్వీ కి వచ్చినా.. ఆమె కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయితే తగలడం లేదు.
Janhvi Kapoor new look:
Janhvi Kapoor new glamour look goes viral