ByGanesh
Sat 01st Jul 2023 04:31 PM
కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత హెల్దీగా ప్రెగ్నెన్సీ సమయంలోనూ బేబీ బంప్స్ తో, అలాగే శ్రీమంతం అప్పుడు ఆ తర్వాత డెలివరీ అయ్యి బాబు పుట్టడం అన్ని చకచకా జరిగిపోయాయి. కాజల్ అగర్వాల్ కాస్త ఒళ్ళు చేసినా తర్వాత బరువు తగ్గేందుకు తగిన కసరత్తులు చేస్తూ యాధస్థితికి చేరుకొని మళ్ళీ గ్లామర్ డాల్ గా మారిపోయింది. మరికాస్త డోస్ పెంచి అందాలు చూపిస్తూ కవ్విస్తున్న కాజల్ అగర్వాల్ ప్రస్తుతం కమల్ హాసన్ ఇండియన్2, బాలకృష్ణ భగవంత్ కేసరి మూవీస్ లో నటిస్తుంది. అలాగే రీసెంట్ గా కాజల్ విమెన్ సెంట్రిక్ మూవీస్ కి ప్రాధ్యానతనిస్తుంది.
తాజాగా తాను డిప్రెషన్ కి లోనై కోలుకున్నట్టుగా చెప్పి షాకిచ్చింది. తాను డెలివరీ తర్వాత పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ లోకి వెళ్లినట్లుగా చెప్పింది. అది చాలామంది మహిళలకి జరిగే సర్వసాధారణ విషయమే. ఇలాంటి డిప్రెషన్ కి లోనైనవారికి ఫ్యామిలీ అండగా నిలబడితే వారు త్వరగా కోలుకుంటారు. ప్రసవం తర్వాత మహిళలు తమకి తాము కొద్దిగా సమయాన్ని కేటాయించుకోవాలి. ట్రైనర్ ఆధ్వర్యంలో వర్కౌట్స్ చెయ్యడం, ఇష్టమైన వాళ్లతో టైమ్ స్పెండ్ చెయ్యడం, ఇలా కాస్త బిజీగా హ్యాపీగా ఉంటే ఆ డిప్రెషన్ సమయాన్ని దాటవచ్చు.
నేను డిప్రెషన్ లోకి వెళ్ళినప్పుడు నన్ను ఎంతో ప్రేమించే నా కుటుంబంతో పాటుగా నన్ను అర్ధం చేసుకునే భర్త ఉండడంతోనే నేను చాలా త్వరగా దాని నుండి బయటపడ్డాను. పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ తో నేను ఉన్నప్పుడు నా భర్త గౌతమ్ చాలా సమస్యలను ఎదుర్కుంటూ చాలా కష్టమైనా పరిస్థితిని చూసారు.. అంటూ కాజల్ తన హెల్త్ సీక్రెట్ ని అభిమానులతో చిట్ చాట్ చేసినప్పుడు బయటపెట్టేసింది.
Kajal Aggarwal Shares Secrets About Health secrets:
Kajal Aggarwal talks about pregnancy and post partum