ByGanesh
Mon 25th Nov 2024 03:21 PM
రిషబ్ శెట్టి నటించిన కాంతారా మూవీ పాన్ ఇండియా మార్కెట్ లో సెన్సేషనల్ హిట్ గా నిలవడంతో దానికి ప్రీక్వెల్ గా కాంతార 1 ని మొదలు పెట్టారు మేకర్స్. రిషబ్ శెట్టి ఈసారి కాంతార 1 చిత్రాన్ని భారీ అంచనాల నడుమ భారీగా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
తాజాగా కాంతార చాప్టర్ 1లో నటిస్తున్న నటులకు రోడ్డు ప్రమాదం జరగడం కలకలం సృష్టించింది. షూటింగ్ కోసం జూనియర్ ఆర్టిస్టులను తరలిస్తున్న మినీ బస్సు బోల్తా పడిన ఘటన హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పటికే రెండు షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకున్న కాంతార 1 మూడో షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసే పనిలో టీమ్ అంతా బిజీగా ఉంది.
అందులో భాగంగా ముదూరులో షూటింగ్ ముగించుకుని కొల్లూరు వెళ్తుండగా జూనియర్ ఆర్టిస్టులు ప్రయాణిస్తున్న మినీ బస్ బోల్తాపడినట్లుగా తెలుస్తుంది. ప్రమాదం జరిగిన టైమ్ లో ఈ బస్సులో 20 మంది జూనియర్ ఆర్టిస్టులు ప్రయాణిస్తున్నారని సమాచారం. అందులో ఐదారుగురికి స్వల్ప గాయాలు తగిలాయని.. ప్రస్తుతం వీరంతా క్షేమంగా ఉన్నారని సమాచారం.
Kantara 1 six actors injured in accident:
Kantara Chapter 1 six actors injured in accident in Karnataka