Karnataka Government Re-issues Guidelines To Schools Bag Weight No More Than 15 Percent Of Student Bodyweight

School Bag Guidelines: 

కర్ణాటకలో కొత్త గైడ్‌లైన్స్ 

కర్ణాటక ప్రభుత్వం స్కూల్ బ్యాగ్స్‌కి సంబంధించి కీలక గైడ్‌లైన్స్ ఇచ్చింది. 2019 నాటి సర్క్యులర్‌నే మరోసారి జారీ చేసింది. School Education and Literacy డిపార్ట్‌మెంట్ బ్లాక్‌ లెవల్ విద్యాధికారులకు ఇప్పటికే ఆదేశాలిచ్చింది. కచ్చితంగా ఇది అమలవ్వాలని తేల్చి చెప్పింది. ఈ సర్క్యులర్ ప్రకారం…స్కూల్ బ్యాగ్ బరువు విద్యార్థి బరువులో 15% కి మించి ఉండకూడదని స్పష్టం చేసింది. ఈ గైడ్‌లైన్స్‌ ఆధారంగా చూస్తే…1-2 తరగతులకు చెందిన విద్యార్థుల బ్యాగ్‌ల బరువు 1.5-2 కిలోలు, 3-5 క్లాస్‌లకు చెందిన విద్యార్థుల బ్యాగ్‌ల బరువు 2-3 కిలోల మధ్యలో ఉండాలని అధికారులు వెల్లడించారు. క్లాస్ 6-8 విద్యార్థుల బ్యాగ్‌లు 3-4 కిలోలు, క్లాస్‌ 9-10 విద్యార్థుల బ్యాగ్‌ల బరువు 4-5 కిలోల వరకూ ఉండొచ్చని తెలిపారు. అంతేకాదు. దీంతో మరో సర్క్యులర్‌నీ జారీ చేశారు. రాష్ట్రంలోని ప్రతి స్కూల్‌ వారానికో రోజు “నో బ్యాగ్ డే” (No Bag Day) జరపాలని, శనివారాల్లో నిర్వహిస్తే మంచిదని సూచించింది. డాక్టర్ వీపీ నిరంజనారాధ్య కమిటీ (Dr VP Niranjanaradhya Committee)ఇచ్చిన సూచనల ఆధారంగా ఈ సర్క్యులర్‌లు జారీ చేసింది. స్కూల్‌ బ్యాగ్‌ల బరువు వల్ల విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభావం పడుతోందని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ అన్నీ పరిశీలించి బ్యాగ్‌లు ఎంత బరువుండాలో తేల్చి చెప్పింది. ఎప్పుడో ఈ కమిటీని ఏర్పాటు చేయగా..2018-19లో ఫైనల్ రిపోర్ట్‌ని అందించింది. 2019లో కర్ణాటక ప్రభుత్వం అన్ని స్కూల్స్‌కీ ఆదేశాలిచ్చింది. విద్యార్థి బరువులో 10% కి మించకుండా స్కూల్‌ బ్యాగ్‌ బరువు ఉండాలని తేల్చి చెప్పింది.

బీఐఎస్ ఏం చెప్పిందంటే..

గతేడాది ఏప్రిల్‌లో  Bureau of Indian Standards కీలక ప్రకటన చేసింది. స్కూల్‌ బ్యాగ్‌ల బాధలు తప్పించే విధంగా ఓ ప్రత్యేక విధానాన్ని రూపొందిస్తామని వెల్లడించింది. ఈ విషయమై కొందరు ప్రశ్నించగా..BIS డైరెక్టర్ జనరల్ “త్వరలోనే మా సంస్థ తరపున రీసెర్చ్ చేస్తాం. దీనికంటూ ప్రత్యేకంగా ఓ విధానాన్ని తయారు చేస్తాం” అని సమాధానమిచ్చారు. 

పాఠాల్లోనూ మార్పులు..

కర్ణాటక ప్రభుత్వం RSS ఫౌండర్ కేబీ హెడ్గేవర్ ( KB Hedgewar) పాఠాన్ని స్కూల్ సిలబస్ నుంచి తొలగిస్తున్నట్టు ఈ మధ్యే వార్తలు వచ్చాయి. దీనిపై సిద్దరామయ్య త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలోనే కర్ణాటక విద్యాశాఖ మంత్రి మధు బంగారప్ప కీలక ప్రకటన చేశారు. స్కూల్ సిలబస్ నుంచి కేబీ హెడ్గేవర్ లెసన్‌ని తొలగిస్తున్నట్టు వెల్లడించారు. గత ప్రభుత్వం సిలబస్‌లో చేసిన మార్పులన్నింటినీ తొలగించి పాత సిలబస్‌నే కొనసాగించనున్నట్టు ప్రకటించారు. ఇదే సమయంలో మరో కీలక నిర్ణయమూ తీసుకుంది సిద్దరామయ్య సర్కార్. భారత రాజ్యాంగంలోని పీఠికను అన్ని పాఠశాలల్లోని విద్యార్థులు చదవాలని ఆదేశాలు జారీ చేసింది. కేబినెట్ మీటింగ్‌లో విద్యాశాఖ మంత్రితో చర్చించిన సిద్దరామయ్య…టెక్స్ట్‌బుక్స్ రివిజన్‌కీ మొగ్గు చూపారు. త్వరలోనే ఈ నిర్ణయాన్నీ అమల్లోకి తీసుకురానున్నారు. దీంతో పాటు మత మార్పిడి నిరోధక చట్టాన్నీ (Anti-Conversion Law) తొలగించింది ప్రభుత్వం. ఇలాంటి చట్టాలతో ఎలాంటి ప్రయోజనం లేదని సిద్దరామయ్య తేల్చి చెప్పారు. 

Also Read: Yoga Day Guinness Record: ఒకేసారి 1.53 లక్షల మందితో యోగాసనాలు, గిన్నిస్ రికార్డు నెలకొల్పిన సూరత్

Source link