Kerala Court sentences teacher to 111 years in prison for abusing minor student

Abusing minor student in Kerala | తిరువనంతపురం: ఎన్నో కఠిన తీసుకొచ్చి అమలు చేస్తున్న బాలికలు, మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. చాలా వరకు తెలిసిన వ్యక్తులే ఈ దారుణాలకు పాల్పడుతున్నారని, జాతీయ క్రైమ్ రిపోర్ట్స్ గణాంకాలు, పోలీసులు నమోదు చేసిన కేసులు వెల్లడిస్తున్నాయి. ఇలాంటి ఘటనలో బాలికపై లైంగిక దాడికి పాల్పడిన టీచర్‌కు 111 ఏళ్ల కఠిన కారాగార జైలుశిక్ష విధించింది కోర్టు. కేరళలోని ఫాస్ట్‌-ట్రాక్‌ కోర్టు మైనర్ బాలికపై ఓ అత్యాచారం కేసులో ఈ కీలక తీర్పు వెలువరించింది. దాంతోపాటు నిందితుడికి రూ.1.05 లక్షల జరిమానా సైతం విధించింది. బాలికపై తన భర్త అత్యాచారం చేశాడని తెలియడంతో అవమాన భారంతో నిందితుడి భార్య ఆత్మహత్య చేసుకుంది.

అసలేం జరిగిందంటే.. 
కేరళకు చెందిన మనోజ్‌ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగిగా చేస్తున్నాడు. దాంతో అతడు తన ఇంటివద్ద విద్యార్థులకు ప్రైవేట్ ట్యూషన్‌లు చెబుతుండేవాడు. ఈ క్రమంలో 2019లో తన వద్దకు ట్యూషన్‌కు వచ్చి క్లాసులు వింటున్న ఓ ఇంటర్‌ విద్యార్థినిపై దారణానికి పాల్పడ్డాడు. విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడటంతో పాటు అశ్లీల ఫొటోలు, వీడియోలు తీశాడు. తరువాత ఆ ఫొటోలను తన ఫ్రెండ్స్‌కు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దాంతో విషయం ఆనోటా ఈనోటా పాకి బాధిత విద్యార్థికి తెలిసిందే. అప్పటివరకూ జరిగిన దారుణాన్ని తనలోనే దాచుకున్న ఇంటర్ విద్యార్థిని భయంతో ట్యూషన్‌కు వెళ్లడం సైతం మానేసింది. ఏం జరిగిందని తల్లిదండ్రులు పదే పదే అడగడంతో వారికి జరిగిన దారణాన్ని చెప్పింది. బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. మనోజ్‌పై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

ఫోరెన్సిక్ పరిశీలనతో దొరికిపోయిన టీచర్

అయిదేళ్ల కింద జరిగిన లైంగిక దాడి ఘటనలో నిందితుడు మనోజ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి మొబైల్ స్వాధీనం చేసుకుని పరిశీలించారు. అతడి తీరు నిజంగానే అనుమానాస్పదంగా కనిపించడంతో ఫోరెన్సిక్‌ పరీక్షలకు పంపించగా మొబైల్‌లో విద్యార్థినిని అశ్లీల ఫొటోలు తీసినట్లు నిర్ధారించారు. తనకు ఏ పాపం తెలియదని, పోలీసులు చెప్పిన ఘటన జరిగిన రోజు కూడా తాను ఆఫీసులోనే ఉన్నానంటూ సాకులు చెప్పేందుకు యత్నించాడు.

కేసు తీవ్రతను అర్థం చేసుకున్న పోలీసులు నిందితుడు కాల్‌ రికార్డులు చెక్ చేశారు. లైంగిక దాడికి పాల్పడిన సమయంలో అతడి మొబైల్ లొకేషన్‌ చెక్ చేయగా ఆ రోజు నిందితుడు మనోజ్ తన ఇంటి వద్ద, ఇంటి సమీపంలోనే సెల్ ఫోన్ సిగ్నల్ ట్రేస్ అయింది. పోలీసులు పూర్తి సాక్ష్యాలు సేకరించి కేరళ స్పెషల్‌ ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో నిందితుడ్ని హాజరుపరిచారు. కేసు సాక్ష్యాలు పరిశీలించిన న్యాయమూర్తి నిందితుడిలో పశ్చాత్తాపం కనిపించకపోగా, తనకు సంబంధం లేదని బుకాయించడాన్ని తీవ్రంగా పరిగణించారు. మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడినందుకు నిందితుడు మనోజ్‌కు 111 ఏళ్ల కఠిన శిక్ష విధిస్తూ కేరళ ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.

Also Read: Nimisha Priya: భారతీయ నర్సుకు యెమెన్‌లో మరణ శిక్ష ఖరారు – విడుదలకు కృషి చేస్తున్నామన్న విదేశాంగ శాఖ

మరిన్ని చూడండి

Source link