Kerala man arrested for abetment to suicide wife: కేరళలో మూడు రోజుల కిందట విష్ణుజా అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఇప్పుడీ ఆత్మహత్య అంశం కేరళ మొత్తం హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే విష్ణుజా వాట్సాప్ చాట్స్ వెలుగులోకి వచ్చాయి. అందులో ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఎంత మానసిక వేదన అనుభవించిందో స్పష్టంగా ఉంది. అమె స్నేహితులు, బంధువులు అందరూ ఆమెకు న్యాయం చేయాలని మీడియా ముందుకు వస్తున్నారు. ఇంతకీ ఆ వాట్సాప్ చాట్స్‌లో ఏముందంటే ?
ఇరవై ఆరేళ్ల విష్ణుజాకు, ప్రబీన్ అనే యువకుడితో పెళ్లి అయింది. అయితే పెళ్లయిన వెంటనే ప్రబీన్ తన భార్యను కలర్ పేరుతో కించ పర్చడం ప్రారంభించాడు. నల్లగా ఉన్నావని ఎగతాళి చేయడం ప్రారంభించాడు. అది రోజు రోజుకు పెరిగిపోయింది. నల్లగా ఉన్నావని కించపర్చడమే కాదు.. ఉద్యోగం కూడా తెచ్చుకోవడం చేత కాదా అని నిందించడం ప్రారంభించాడు. కట్నం కూడా తీసుకు రాలేదు.. కనీసం ఉద్యోగం కూడా చేయవా అని టార్చర్ పెట్టేవాడు. పెళ్లి అయి కొంతకాలమే అయినా.. అద్భుతమైన జీవితాన్ని ఊహించుకున్న విష్ణుజా.. తన జీవితం తలకిందులు అయ్యే సరికి నరకయాతన అనుభవించి ఇక తన వల్ల కాదు అని ఆత్మహత్య చేసుకుంది.
ఆమె ఆత్మహత్య అంశం కలకలం రేపింది. తన జీవితంలో జరుగుతున్న పరిణామాలను అప్పుడప్పుడూ తన స్నేహితులతో పంచుకునేది. దీంతో విష్ణుజాకు జరిగిన అన్యాయాన్ని బయటకు తేవాలని ఆమె స్నేహితులు కొందరు .. వాట్సాప్ చాట్‌లను బహిర్గతం చేశారు. విష్ణుజా భర్త ప్రబీన్ . మానసికంగా వేధిస్తూ.. ఆమెను ఆత్మహత్య చేసుకునేలా చేశాడని బయట పెట్టారు. దీంతో పోలీసులుకేసులు పెట్టారు , విష్ణుజా ఫోన్ ను స్వాధీనం చేసుకుని వాట్సాప్ చాట్స్ ను రిట్రీవ్ చేసుకుంటున్నారు.
Also Read: ‘నా తండ్రి మృతదేహం 2 ముక్కలు చేయండి’ – ఓ కొడుకు డిమాండ్, మధ్యప్రదేశ్‌లో షాకింగ్ ఘటన
ఇటీవలి కాలంలో భార్య వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న అతుల్ సుభాష్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆడవారు.. చట్టాలను అడ్డం పెట్టుకుని విబేధాలు వచ్చిన భర్తల జీవితాలతో ఆడుకుంటున్నారని ఈ ఘటనతో చాలా మంది ప్రశ్నించడం ప్రారంభించారు. అయితే మౌనంగా హింసకు గురయ్యే ఆడవారు అనేక మంది ప్రాణాలు తీసుకుంటున్నారు. అలాంటి చట్టాలు కూడా వారిని కాపాడలేకపోతున్నాయి. అతుల్ సుభాష్ లాంటి వాళ్లే కాకుండా.. ప్రబీన్ లాంటి వారు కూడా సమాజంలో ఉంటారని ఇలాంటి ఘటనలు నిరూపిస్తున్నాయని చెబుతున్నారు.
Also Read: Crime News: కూతురి చదువంటూ భర్త కిడ్నీ అమ్మేసింది – ఆ డబ్బు తీసుకుని ప్రియుడితో రాత్రికి రాత్రే జంప్, కట్ చేస్తే..
మరిన్ని చూడండి