ByGanesh
Sun 16th Jul 2023 06:41 PM
KGF సీక్వెల్ లో క్యూట్ గా స్వీట్ లుక్స్ తో ఆకట్టుకున్న శ్రీనిధి శెట్టి ఆ తర్వాత ఆమెకి మళ్ళీ KGF అంతటి భారీ ఆఫర్ రాలేదు, అంతటి హిట్ దొరకలేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న కోలీవుడ్ కోబ్రా శ్రీనిధి శెట్టి ని బాగా నిరాశపరిచింది. అయితే KGF ప్యాన్ ఇండియా మార్కెట్ లో బ్లాక్ బస్టర్ అవడంతో శ్రీనిధికి పలు భాషల నుండి ఆఫర్స్ వచ్చేస్తాయని టాక్ నడిచింది. కానీ శ్రీనిధిని ఎవరూ, ఏ భాషా దర్శకనిర్మాతలు పట్టించుకోలేదు. మధ్యలో శ్రీనిధి శెట్టి పారితోషకంతో భయపెడుతుంది అనే ప్రచారమూ జరిగింది.
అయితే తాజాగా శ్రీనిధి శెట్టి సీక్రెట్ గా వివాహము చేసుకుంది అంటూ కొన్ని ఫొటోస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఆ పిక్స్ లో శ్రీనిధి శెట్టి ట్రెడిషనల్ గా కనిపించడమే కాకుండా నుదుటున సింధూరంతో కనిపించింది. మరి పెళ్లయిన యువతులు నుదుటున సింధూరం ఉంటుంది. ఇప్పుడు శ్రీనిధి నుదుటున సింధూరం కనిపించగానే ఆమెకి పెళ్లయ్యింది అనే ప్రచారాన్ని షురూ చేసారు. అయితే శ్రీనిధి శెట్టికి వివాహం అవలేదని అంటున్నారు.
కర్ణాటకలోని తుళి ప్రాతానికి చెందిన ఫామిలీస్ కొన్ని పెళ్లి కాకపోయినా వాళ్ళ సంప్రదాయం ప్రకారం నుదుటున బొట్టు పెట్టుకుంటారని తెలుస్తుంది. అందువల్లే శ్రీనిధి శెట్టి కూడా తమ కుటుంబ సాంప్రదాయం ప్రకారమే నుదుటున సింధూరం పెట్టుకుంది అంతేకాని ఆమెకి పెళ్లి అవ్వలేదు అని తెలుస్తోంది.
KGF Actress Srinidhi Shetty Got Married Secretly?:
Srinidhi Shetty Marriage, Photos Viral