Kiara Advani has slowed down in her career కెరీర్ లో నెమ్మదించిన కియారా అద్వానీ

బాలీవుడ్ అందాల తార కియరా అద్వాని కెరీర్‌లో ఇటీవల కొంత నెమ్మదించినట్లు కనిపిస్తోంది. సినీ ప్రస్థానం ప్రారంభమైనప్పుడు మంచి క్రేజ్ సంపాదించి సినిమాలు, వెబ్ సిరీస్‌లతో దూసుకుపోయిన ఈ భామ ప్రస్తుతం పెద్దగా డిమాండ్ లేకపోవడం గమనార్హం.

కియరా బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో కూడా కొన్ని కీలక ప్రాజెక్టుల్లో నటించింది. మహేష్ బాబు సరసన భరత్ అనే నేను సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత రామ్ చరణ్ తో వినయ విధేయ రామ, గేమ్ ఛేంజర్ సినిమాల్లో నటించింది. అయితే గేమ్ ఛేంజర్ ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో కియరా కెరీర్‌పై కొంత ప్రభావం పడింది.

2024లో ఒక్క సినిమా కూడా విడుదల కాకపోవడం, 2025 ప్రారంభంలోనే గేమ్ ఛేంజర్ నిరాశపరిచేయడంతో కియరా కెరీర్‌లో ఆందోళన నెలకొంది. అయితే ఆమె నటిస్తున్న రాబోయే సినిమాలు మాత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకునే అవకాశముంది.

హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న వార్ 2లో ఆమె కీలక పాత్రలో కనిపించనుంది. యశ్ నటిస్తున్న టాక్సిక్ సినిమాలో కూడా ఆమె నటించే అవకాశముంది. ఈ రెండు ప్రాజెక్టులు 2025లో విడుదల కావొచ్చని భావిస్తున్నారు. ముఖ్యంగా వార్ 2 ఖచ్చితంగా విడుదల అవుతుందని సమాచారం.

సినిమాలు చేస్తూనే తనపై ఆసక్తిని పెంచేందుకు కియరా ఇప్పుడు వరుస ఫోటోషూట్లతో సోషల్ మీడియాను హీట్ పెంచాలని నిర్ణయించుకుంది. వార్ 2, టాక్సిక్ విజయాలు ఆమె కెరీర్‌ని మళ్లీ టాప్ లీగ్‌కు తీసుకెళ్లే అవకాశముంది. ఆమె అభిమానులు కూడా ఆమె తిరిగి విజయపథంలోకి రావాలని ఆకాంక్షిస్తున్నారు. లక్ కలిసొస్తే మరోసారి కియరా టాప్ హీరోయిన్స్ జాబితాలో నిలవడం ఖాయం.

Source link