Kinnar Akhara head expels Mamta Kulkarni Laxmi Naarayan Tripathi for treason: మహాకుంభ్‌లో సన్యాసినిగా మారిన మమతా కులకర్ణికి కిన్నార్ అఖాడా షాక్ ఇచ్చింది. ఆమెతో పాటు లక్ష్మీనారాయణ్ త్రిపాఠి అనే సన్యాసిని కూడా బహిష్కరించారు. వీరిద్దరూ కిన్నెర ఆఖాడా రూల్స్ ఉల్లంఘించారని కిన్నెర అఖాడా హెడ్ రిషి అజయ్ దాస్ ప్రకటించారు. మహాముండలేశ్వర్ గా మమతా కులకర్ణి, త్రిపాఠిలను తొలగిస్తున్నందుకు త్వరలో మహామండలేశ్వర్ గా కొత్తవారిని నియమిస్తామని రిషిఅజయ్ దాస్ ప్రకటించారు. మమతా కులకర్ణి చాలా కేసుల్లో నిందితురాలిగా ఉన్నారని ఆమెను మహామండలేశ్వర్ గా నియమించడం సనాతన ధర్మ సూత్రాలకు విరుద్ధమని రిషి అజయ్ దాస్ చెబుతున్నారు.
కిన్నెర అఖాడా వ్యవస్థాపకుడిని అయిన తనకు తెలియకుండానే ఏ మతపరమైన, అఖాడ సంప్రదాయాన్ని అనుసరించకుండా మమతా కులకర్ణికి సన్యాసం ఇచ్చి వెంటనే ఆమెకు మహామండలేశ్వర్ గా ప్రకటించారని అన్నారు. ఈ కారణంగా సనాతన ధర్మం, సమాజ ప్రయోజనాల దృష్ట్యా ఆమెను ఆ పదవి నుండి తొలగించవలసి వచ్చిందని రిషి అజయ్ దాస్ మీడియా ప్రకటనలో పాల్గొన్నారు. అవసరమైన ఆచారాలను పాటించకుండా , ప్రాపంచిక అనుబంధాలను త్యజించకుండా అఖాడాలలో అక్రమంగా చేరకూడదంటున్నారు.
ఇలా చేసేవారు సనాతన ధర్మం, సమాజ ప్రేమికులను మోసం చేస్తున్నారుని వారంటున్నారు. మమతా కులకర్ణిని అఖాడాలో చేర్చుకోవడంపై పలువురు విమర్శలు గుప్పించారు. ట్రాన్స్‌జెండర్ కథావక్కక్ జగత్గురు హిమాంగి సఖి మాతో సహా పలువురు సభ్యులు మమతా కులకర్ణి గత చరిత్రను ప్రస్తావించి ఆమెకు ఎలా సన్యాసం ఇస్తారని.. మహామండలేశ్వర్ గా ప్రకటిస్తారని ప్రశ్నించారు. పబ్లిసిటీ కోసం కిన్నార్ అఖాడా మమతా కులకర్ణిని మహామండలేశ్వర్‌గా చేసిందన్న ఆరోపమలు వచ్చాయి. సమాజానికి ఆమె గతం బాగా తెలుసని.. మాదకద్రవ్యాల కేసులకు సంబంధించి గతంలో ఆమెకు జైలు శిక్ష కూడా పడిందన్నారు. దీనిపై విచారణ చేయాలని కొంత మంది అఖాడాలు డిమాండ్ చేశారు.
మమతా కులకర్ణి 90వ దశకంలో హీరోయిన్‌గా పరిచయం అయింది. 1991లో నాన్బరల్ తమిళ సినిమాతో దక్షిణాది సినిమాల్లోనూ నటించింది. హిందీ, కన్నడ, తెలుగు, బెంగాలీ, మలయాళ సినిమాల్లోనూ నటించింది. ఓ గ్యాంగ్ స్టర్ తో ప్రేమలో పడింది. 2016లో రూ.2వేలకోట్ల డ్రగ్స్ కేసులో ఇరుక్కుంది. . 2016లో కెన్యాలోని అంతర్జాతీయ డ్రగ్ రింగ్‌లో జరిగిన సమావేశానికి కులకర్ణి తన భాగస్వామి విక్కీ గోస్వామి, ఇతర సహ నిందితులతో కలిసి హాజరయ్యారని ఆరోపణలున్నాయి. ఈ కేసులో బాంబే హైకోర్టును ఆశ్రయించగా.. సుదీర్ఘంగా విచారించిన కోర్టు క్లీన్ చీట్ ఇచ్చింది. ఇప్పుడు సన్యాసం తీసుకున్నా కలసి రాలేదు.
మరో ఆసక్తికర కథనం: ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలోనే ఎక్కువ పన్నులు వసూలు చేస్తున్నారా?
మరిన్ని చూడండి