kolkata doctor murder Celina Jaitly Reveals A Man Flashed His Private Parts long ago | Celina Jaitly: తప్పు ఎవరిదైనా అమ్మాయిలనే నిందిస్తారు

Celina Jaitly Tweet on kolkata doctor rape case: కోల్‌కతా ఆర్జీ కార్‌ మెడికల్‌ కాలేజీలో ట్రైనీ వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తూనే ఉంది. ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. కోల్‌కతా నిరసనలతో  దద్దరిల్లుతోంది. మరోవైపు.. ఈ కేసులో నిందితులను శిక్షించాలని, బాధితురాలికి న్యాయం జరగాలని ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు కూడా తమ గళం వినిపిస్తున్నారు. ఈ క్రమంలో… బాలీవుడ్‌ నటి సెలీనా జైట్లీ ఆసక్తికర ట్వీట్‌ చేశారు. కోల్‌కతా  వైద్యురాలకి జరిగిన దారుణాన్ని తలుచుకుంటూ… తానూ బాధితురాలినే అంటూ చెప్పుకొచ్చారు. చిన్నతనంలో ఎన్నో వేధింపులు భరించానని… ఓ వ్యక్తి తన ప్రైవేట పార్ట్‌ను చూపించి అసహ్యంగా ప్రవర్తించాడని రాసుకొచ్చింది. తన బాధను..  టీచర్‌తో చెప్పుకుంటే… తనదే తప్పని నిందించారని బాధపడింది సెలీనా. ఏం జరిగినా… ఈ ప్రపంచం బాధితురాలినే వేలెత్తి చూపిస్తుందని అసహనం వ్యక్యం చేసింది. ట్వీట్‌కు.. తాను ఆరో తరగతి చదువుతున్నప్పటి ఫొటోను జత చేసింది సెలీనా  జైట్లీ. ఆ వయస్సులో తాను ఎదుర్కొన్న వేధింపులను వెల్లడిస్తూ… సుధీర్ఘమైన పోస్ట్‌ పెట్టింది.

సెలీనా పెట్టిన పోస్టులో ఏం చెప్పిందంటే.. 
ఆరో తరగతి చదువుతున్న సమయం నుంచే అబ్బాయిలు.. నన్ను వేధించారు. ఉపాధ్యాయులకు చెప్పినా పట్టించుకోలేదు. నాదే తప్పు అన్నట్టు మాట్లాడారు. చిన్నతనంలో తన స్కూల్‌ పక్కనే బాలుర యూనివర్సిటీ ఉండేది. ఆ యూనివర్సిటీ  విద్యార్థులు… స్కూల్‌ నుంచి వెళ్లే సమయంలో నా రిక్షాను ఫాలో చేసేవారు. వారిని గమనించనట్టు నట్టించేదాన్ని. కొన్ని రోజుల తర్వాత వారు నా దృష్టిని ఆకర్షించేందుకు.. నాపై రాళ్లు విసరడం ప్రారంభించారు. అక్కడున్న వాళ్లలో ఎవరూ.. వారిని  అడ్డుకోలేదు. టీచర్‌కు ఫిర్యాదు చేస్తే… నాదే తప్పు అన్నారు. నేను మోడ్రన్‌ అమ్మయినని… వదులుగా ఉన్న దుస్తులు ధరించలేదని.. జట్టుకు నూనె రాసి రెండు జెడలు వేసుకోలేదని అన్నారు. నా ప్రవర్తన వల్లే అబ్బాయిలు వెంటపడుతున్నారని  నన్నే నిందించారు. అంతేకాదు.. ఒకరోజు ఉదయం స్కూల్‌ రిక్షా కోసం ఎదురుచూస్తున్న నాకు… ఒక వ్యక్తి తన ప్రైవేట్‌ పార్టులను చూపించి అసహ్యంగా ప్రవర్తించాడు. చాలా ఏళ్లు ఆ సంఘటనలు నన్ను వేధించాయి. నాదే తప్పు అన్న  ఉపాధ్యాయుల మాటలు కూడా బాధించాయి. 11వ తరగతి చదువుతున్నప్పుడు కూడా వేధింపులకు గురయ్యాను. నా స్కూటీపై అసభ్యకరమైన పోస్టర్లు అంటించేవారు. నన్ను అసభ్యకరమైన పేర్లతో పలిచేవారు. అయినా… వారిని నేను  పట్టించుకోకపోవడంతో… ఒకసారి నా స్కూటీ బ్రేక్‌ వైర్లు కూడా కట్‌ చేశారు. ఆ సంఘటన నాకు ఇప్పటికీ గుర్తింది. మా క్లాస్‌లో ఉన్న అబ్బాయిలు.. నాపై టీచర్లకు ఫిర్యాదులు ఇచ్చారు. టీచర్‌ నన్ను పిలిచి తిట్టింది. నువ్వు.. ఫార్వర్డ్‌ టైమ్‌  అమ్మాయిలా కనిపిస్తున్నావు… స్కూటీ నడుపుతావు, జీన్స్‌ వేసుకుంటావు. పొట్టి జుట్టుతో క్లాసులకు వెళ్తావు. అందుకే అబ్బాయిలు నీది లూజ్‌ క్యారెక్టర్‌ అని అనుకుంటున్నారు. అది నీ తప్పే అంటూ టీచర్‌ తిట్టింది. నా స్కూటీ బ్రేక్‌ వైర్లు కట్‌  చేసిన రోజు… ప్రాణాలు కాపాడుకునేందుకు నేను స్కూటీ పైనుంచి కిందికి దూకేశాను. ఆ ఘటనలో నేను తీవ్రంగా గాయపడ్డాను. శారీరకంగా, మానసికంగా… చాలా బాధపడ్డాను. అయినా… నా తప్పే అని చెప్పారు. నన్ను స్కూల్‌కు  తీసుకెళ్లేందుకు మా రిటైర్డ్‌ కల్నల్‌ తాత రావాల్సి వచ్చింది. మా తాతను కూడా యూనివర్సిటీ అబ్బాయిలు అవమానకరంగా మాట్లాడటం నాకు ఇప్పటికీ గుర్తుంది అంటూ పోస్టు పెట్టింది సెలీనా జైట్లీ.

నూనె రాసుకోవడం, జుట్టు అల్లడం, స్కూల్‌ యూనిఫామ్‌గా.. సల్వార్‌ కమీజ్‌ ధరించడం వల్ల మనస్తత్వాలు మారవని అన్నారు. చెడు చేయాలనుకున్న వారు… ఎప్పుడు ఎవరిపైన అయినా… ఎలా ఉన్నా… చెడు చేస్తారని చెప్పారు. ఇలాంటి  సంఘటనలు చాలానే జరుగుతున్నాయని చెప్పారామె. వాటి గురించి ఆలోచిస్తే తనకు ఇప్పటికీ వణుకు పుడుతుందోని అన్నారు. జాగ్రత్తగా ఉండాలని ఎంతసేపు అమ్మాయిలకే చెప్తారు గానీ… అమ్మాయిల జోలికి వెళ్లొద్దని అబ్బాయిలకు మాత్రం  ఎవరూ చెప్పరని… అలాంటి సమాజంలో మనం ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు సెలీనా. ఇప్పుడు మనం లేచి నిలబడి మన హక్కులు రక్షించమని అడగాల్సిన సమయం వచ్చిందని పోస్టులో పేర్కొన్నారు. 

మరిన్ని చూడండి

Source link