KTR raised the issue of water and electricity shortages with data centers | KTR Latest News: డేటా సెంటర్లతో నీటి, విద్యుత్ కొరత

KTR Latest News: ప్రపంచంలో టెక్నాలజీ శరవేగంగా అభివృద్ధి చెందితోంది. మానవుడి అవసరాలకు మించి జరుగుతోంది. సాంకేతికత పెంచుకుంటూ వెళ్తున్నప్పటికీ అది కలిగించే సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టడం లేదు. అలాంటి వాటిలో డేటా సెంటర్లు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా డేటా సెంటరర్ల ఏర్పాటు చేసేందుకు కూడా వివిధ సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇలాంటి డేటా సెంటర్ల ఏర్పాటుతో అనేక సమస్యలు వస్తాయని పోరాటాలు చేస్తున్న వాళ్లు కూడా ఉన్నారు.

ఇదే ఇష్యూను బెంగళూరులో జరిగిన  ‘ఎంట్రప్రెన్యూర్ టెక్ & ఇన్నోవేషన్ సమిట్ – 2025’లో మాజీ మంత్రి కేటీఆర్ లేవనెత్తారు. టెక్నాలజీకి రెండు వైపు పదును ఉంటుందని దాన్ని వాడుకోవడంలోనే కాకుండా దాని నుంచి వచ్చే సమస్యల పరిష్కరానికి కూడా చర్యలు తీసుకోవాలని సూచించారు. సాంకేతిక అభివృద్ధి పర్యావరణానికి హాని జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యతను గుర్తు చేశారు. ఈ విషయాల గురించి చెబుతూనే ప్రతి రోజూ భారీగా డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారని వాటి మూలంగా వచ్చే సమస్యలను మాత్రం ఎవరూ అడ్రెస్ చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.  

డేటా సెంటర్ల ఏర్పాటుతో భారీగా విద్యుత్, వాటర్ అవసరం అవుతాయని కేటీఆర్ తెలిపారు. ఈ కేంద్రాల ఏర్పాటుతో కలిగి దుష్ప్రయోజనాలపై అధ్యయనం ఉండటం లేదని  ఇది ప్రమాదకరమని అన్నారు. ఐఓటీ, మోబైల్ యాప్‌లు, డేటా స్టోరేజ్ రోజురోజుకు పెరుగుతోందని దఇది పర్యావరణానికి కేడు చేస్తాయో ఆలోచించాలన్నారు. వాటికి విరుగుడు చర్యలు కూడా తీసుకోవాలని సూచించారు.  

Also Read: దేవాదాయశాఖ పరిధిలోకి ఛార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం, ఇకపై పక్కా లెక్కలు చెప్పాల్సిందే!

డేటా సెంటర్ల వల్ల వచ్చే నష్టాలు ఏంటీ?
యునైటెడ్ స్టేట్స్ ఇంటర్నేషనల్ ట్రేడ్ కమిషన్ మే 2021 నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ డేటా విపరీతంగా పెరుగుతుందని దీని కారణంగా 2010తో పోలిస్తే 146 రెట్లు పెరుగుతుందని అంచనా వేశారు. సర్వర్లు, రౌటర్లు, స్టోరేజ్ సిస్టమ్‌లు, క్లౌడ్-ఆధారిత కంప్యూటింగ్, డిజిటల్ స్టోరేజ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ గేమింగ్, స్ట్రీమింగ్ మ్యూజిక్, సినిమాలు, డేటా అనలిటిక్స్, ఇతర సేవలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. అందుకే డేటా సెంటర్‌ మరిన్ని అవసరం అవుతాయని చెబుతున్నారు. 

గ్లోబల్ డేటా బిజినెస్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ అయిన Statista.com నుంచి వచ్చిన సమాచారం ప్రకారం డేటా సెంటర్ పరిశ్రమలో యుఎస్ ప్రపంచ అగ్రగామిగా ఉంది. ఈ డేటా సెంటర్ల నిరంతరం పని చేస్తూ ఉండాలి. భారీ భవనాల్లో ఉండే ఈ డేటా కేంద్రాలను కూల్ చేయడానికి భారీగా నీరు, విద్యుత్ అవసరం. నీరు రెండు రకాలుగా ఇక్కడ అవసరం అవుతుంది. డేటా సెంటర్లు పని చేయడానికి అవసరమైన విద్యుత్తు ఉత్పత్తి చేయడానికి అవసరవుుతంది. రెండు సర్వర్లు, ఇతర డేటా సెంటర్ పరికరాల నుంచి వెలువడే వేడిని కూల్ చేయడానికి  యూజ్ చేస్తారు.  

ఇలా డేటా సెంటర్‌లకు నీటిని వినియోగించడం వల్ల ఆ ప్రాంతాల్లో వాటర్ క్రైసిస్ వస్తోంది. అందుకే చాలా దేశాల్లో వీటికి వ్యతిరేకంగా ఉద్యమాలు వస్తున్నాయి. డేటా సెంటర్‌ల కోసం ఎంత నీరు వినియోగిస్తున్నారు అనేది మాత్రం ఇంత వరకు ఎవరూ చెప్పలేదు. కానీ ది డాల్స్, ఒరెగాన్‌లో, సుదీర్ఘమైన న్యాయ పోరాటం తర్వాత గూగుల్ డేటా సెంటర్లు 355 మిలియన్ గ్యాలన్లకు పైగా వినియోగిస్తోందని తేలింది. కానీ అందుకు తగ్గట్టుగా పర్యావరణాన్ని పరిరక్షించే చర్యలు  తీసుకోవడం లేదని తెలుస్తోంది. ఇలా బింధువులుగా ఉన్న ఉద్యమాలు రేపటి భవిష్యత్‌లో మరింత ఉద్ధృతం అయ్యే ప్రమాదం ఉందనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఇదే అంశాన్ని కేటీఆర్ ప్రస్తావించారు. పర్యావరణాన్ని, సాంకేతికతను అనుసంధానించి అభివృద్ధి జరగాలని అభిప్రాయపడ్డారు. 

Also Read: వివాదాలను పరిష్కరించాలని ఎమ్మార్ విజ్ఞప్తి – లీగల్ ఏజెన్సీకి రేవంత్ ఆమోదం

మరిన్ని చూడండి

Source link