L2 Empuraan not connected to Pan India audience పాన్ ఇండియా కు కనెక్ట్ కాని L2 ఎంపురాన్

గతంలో మలయాళంలో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన మోహన్ లాల్-పృథ్వీ రాజ్ సుకుమారన్ ల లూసిఫర్ ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ చిత్రం కలెక్షన్స్ చూసి, కంటెంట్ నచ్చి మెగాస్టార్ చిరు గాడ్ ఫాదర్ గా రీమేక్ చేసారు. అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులు లూసిఫర్ మాతృకనే ఓటీటీలో చూసి ఇష్టపడ్డారు.

లూసిఫర్ చాలా భాషల్లో డబ్ అయ్యి పేరు తెచ్చుకోవడంతో పృథ్వీ రాజ్ సుకుమారన్ ఈసారి లూసిఫర్ సీక్వెల్ లూసిఫర్ 2 అదేనండి ఎంపురాన్ ని పాన్ ఇండియా భాషల్లో ప్రమోట్ చేసి విడుదల చేసారు. లూసిఫర్ సీక్వెల్ అంటే ఆ అంచనాల గురించి వేరే చెప్పక్కర్లేదు. దానితోనే అడ్వాన్స్ బుకింగ్ లో రికార్డ్ నెంబర్లు నమోదు చేసింది ఎంపురాన్.

ఎంపురాన్ మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చేసుకుంది. కానీ పాన్ ఇండియా భాషలకు లూసిఫర్ 2 కనెక్ట్ అవ్వలేదు. అటు ప్రేక్షకులు ఇటు క్రిటిక్స్ ఓవరాల్ గా ఎంపురాన్ కు యావరేజ్ టాక్ ఇవ్వడం హాట్ టాపిక్ అయ్యింది. టైటిల్ ఇతర భాషల ఆడియన్స్ కి నచ్చకపోవడం, యాక్షన్ సీక్వెన్స్ హాలీవుడ్ స్థాయిలో ఉన్నా, ఎక్కువగా హీరో ఎలివేషన్ సీన్స్ కి ప్రాధాన్యత ఇవ్వడం, కథలో ల్యాగ్, నిడివి ఇవన్ని ఎంపురాన్ ని పాన్ ఇండియా ఆడియన్స్ కు నచ్చకుండా చేసాయి.

మోహన్ లాల్ యాక్టింగ్, పృథ్వీ రాజ్ సుకుమారన్ నటన, మేకింగ్ నచ్చినా లూసిఫర్ స్థాయిలో ఎంపురాన్ లేదు అనే విమర్శ ఎక్కువగా వినిపించింది. మరి లూసిఫర్ 2 పాన్ ఇండియా కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయో కాస్త వేచి చూడాల్సిందే.

Source link