Lavanya Say Sorry To Raj Tarun రాజ్ తరుణ్ మరక మంచిదేనా

యంగ్ హీరో రాజ్ తరుణ్ గత ఏడాది కెరీర్ పరంగానే కాదు పర్సనల్ లైఫ్ లోను సతమతమయ్యాడు. కెరీర్ లో వరస వైఫల్యాలతో ఇబ్బంది పడిన రాజ్ తరుణ్ ని అతని మాజీ లవర్ లావణ్య సడన్ గా రోడ్డున పడేసింది. ఆమెను రాజ్ తరుణ్ మోసం చేసి మరో అమ్మాయితో కలిసి ఉంటున్నాడు అంటూ రాజ్ తరుణ్ ఇంటి ముందు ధర్నా చెయ్యడమే కాదు రాజ్ తరుణ్ ఏ సినిమా ప్రమోషన్స్ కు వెళ్లినా వెంటాడింది. 

లావణ్య డ్రగ్స్ కు బానిసయ్యింది, అందుకే ఆమె నుంచి దూరంగా ఉంటున్నా, లావణ్య విషయంలో తన తప్పు లేదు అని రాజ్ తరుణ్ మొత్తుకున్నా అందరూ లావణ్య చెప్పిందే నమ్మారు. అంతలా లావణ్య యూట్యూబ్ ఛానల్స్, ఛానల్స్ లో కూర్చుని రాజ్ తరుణ్ పై దుమ్మెత్తిపోసింది. 

కట్ చేస్తే లావణ్య ఈ విషయంలో రాజ్ తప్పు లేదు కుదిరితే అతని  కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెబుతాను, నేనే రాజ్ తరుణ్ ని అల్లరి చేశాను, మస్తాన్ సాయి చేతిలో మోసపోయాను అంటూ కళ్లనీళ్లు పెట్టుకుంటుంది. 

మరి రాజ్ తరుణ్ ని అంతగా బ్లేమ్ చేసి అతను తలెత్తుకోలేకుండా చేసిన లావణ్య ఇప్పుడు అతని తప్పు లేదు అంటే సరిపోతుందా, రాజ్ తరుణ్ ని ఈ మరక ఎంత డ్యామేజ్ చేసిందో అందరూ చూసారు. అతను సఫర్ అయిన సమయాన్ని తిరిగి ఇస్తుందా, అటు కెరీర్ లో డ్యామేజ్, ఇటు లైఫ్ లో జరిగిన డ్యామేజ్ ఎలా మారుతుంది. మరి రాజ్ తరుణ్ లైఫ్ లో లావణ్య అనే మారక మంచిదేనా, లేదంటే అనేది కాస్త వేచి చూస్తే తెలిసిపోతుంది. 

Source link