Lok Sabha Elections 2024 Phase 1 voting ends: దేశ వ్యాప్తంగా జరుగుతున్న తొలి విడత ఎన్నికలు ముగిశాయి. 21 రాష్ట్రాల్లో 102 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 19న పోలింగ్ జరిగింది. సాయంత్రం 6 గంటల వరకు 60 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. సాయంత్రం 5 గంటల వరకు తమిళనాడులో 63.2 శాతం, రాజస్థాన్‌లో 50.3 శాతం, ఉత్తర్ ప్రదేశ్ 57.5 శాతం, మధ్యప్రదేశ్ 63.3 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. సిక్కింలో 67.5 శాతం, అరుణాచల్ ప్రదేశ్ లో 64.7 శాతం ఓటింగ్ నమోదైంది.
సాయంత్రం 6 గంటల వరకు అండమాన్ నికోబార్ లో 56.87 శాతం, అరుణాచల్ ప్రదేశ్ లో 64 శాతం, అస్సాంలో 70.77 శాతం, బిహార్ లో 46.32 శాతం, ఛత్తీస్ గఢ్ లో 63.41 శాతం, జమ్మూ కాశ్మీర్ లో 65.08 శాతం, లక్షద్వీప్ లో 59.02 శాతం, మధ్యప్రదేశ్ లో 63.25 శాతం, మహారాష్ట్రలో 54.85 శాతం, మణిపూర్ లో 68.62 శాతం, మేఘాలయలో 69.91 శాతం, మిజోరంలో 53.96 శాతం, నాగాలాండ్ లో 56.18 శాతం, పుదుచ్చేరిలో 72.84 శాతం, రాజస్థాన్ లో 50.27 శాతం, సిక్కింలో 68.06 శాతం, తమిళనాడులో 62.08 శాతం, త్రిపురలో 76.10 శాతం, ఉత్తర్ ప్రదేశ్ లో 57.74 శాతం, ఉత్తరాఖండ్ లో 53.56 శాతం, పశ్చిమ బెంగాల్ లో 77.57 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎలక్షన్ కమిషన్ తెలిపింది.
మరిన్ని చూడండి