Karnataka CM Siddaramaiah: కర్ణాటక ముఖ్యమంత్రికి కొద్ది రోజులుగా పెను సమస్యగా ఉన్న మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అధారిటీ భూముల కేసులో ఊరట లభించింది. ఆ వ్యవహారంలో సిద్దరామయ్య తప్పు చేశారనడానికి.. అవినీతి చేశారనడానికి ఆధారాల్లేవని తాజాగా తేల్చింది. గతంలో ఇదే కేసులో సిద్ధరామయ్య విచారణకు లోకాయుక్త ఆదేశించింది. ఆ సమయంలో రాజకీయ దుమారం రేగింది. ఈడీ కూడా రంగంలోకి దిగి కేసు పెట్టింది. అయితే చివరికి కేసులో ఏమీ లేదని తేలిపోవడంతో సిద్దరామయ్య ఊపిరి పీల్చుకున్నారు. ఓ సందర్భంలో ఆయన రాజీనామా చేయాలన్న డిమాండ్లు ఎక్కువగా వినిపించాయి. కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఆయనను తప్పించాలని అనుకుందని చెప్పుకున్నారు. కానీ అన్నింటినీ అధిగమించి ఆయన బయటపడ్డారు.
ముడా స్కాం ఏమిటంటే ?
మైసూరు అర్బన్ డవలప్‌మెంట్ అధారిటీ రెసిడెన్షియల్ లే ఔట్స్ వేసింది. దీని కోసం భూములు సేకరించింది. ఈ భూముల్లో సీఎం సిద్ధరామయ్య సతీమణి నుంచి భూములు తీసుకుంది. అయితే తక్కువ విలవైన భూములు తీసుకుని ప్రత్యామ్నాయంగా మైసూరులో విలువైన భూములు కేటాయించిందన్న ఆరోపణలు వచ్చాయి. ఆమె నుంచి 3 ఎకరాల భూమిని తీసుకుని 50:50 రేషియో కింద ప్లాట్లను ముడా కేటాయించింది. దీనిపై లోకాయుక్త, ఈడీ ఏకకాలంలో విచారణ జరిపాయి. ఈ వ్యవహారంలో సిద్ధరామయ్య భార్యకు కూడా ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. లోకాయుక్త కోర్టు తన నివేదికను కర్ణాటక హైకోర్టుకు సమర్పించింది.
ఈడీ కూడా క్లీన్ చిట్ ఇస్తుందా ?
లోకాయుక్త క్లీన్ చిట్ ఇవ్వడంతో ఇప్ుడు ఈడీ ఏం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఈడీ నమోదు చేసిన ప్రధాన నిందితులుగా సీఎం సిద్ధరామయ్య, ఆయన సతీమణి బీఎం పార్వతితో పాటు మరికొందరు కుటుంబసభ్యులు ఉన్నారరు. ముడాలో పనిచేసిన అప్పటి కీలక అధికారుల పేర్లను కూడా ఈడీ నిందితుల జాబితాలో చేర్చింది. అప్పట్లో ఈడీ వెల్లడించిన నివేదిక ప్రకారం సిద్ధరామయ్య భార్యకి కట్టబెట్టిన 14 సైట్లలో నిబంధనల ఉల్లంఘన జరిగిందని తేల్చారు. ఖరీదైన స్థలాలను కాజేయడంలో భాగంగా మనీలాండరింగ్ ప్రయత్నాలు జరిగాయని వాదించింది.
భూములు అప్పట్లోనే తిరిగి ఇచ్చేసిన సిద్దరామయ్య బార్య
వివాదం వెలుగులోకి వచ్చిన తరవాత భూములన్నింటినీ సిద్ధరామయ్య భార్య తిరిగి ఇచ్చేసింది. ముడాతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకున్నారు. అయితే ఆ తర్వాత కూడా ఈడీ విచారణ కొనసాగించింది. ఈ కేసులో విచారణ సిద్దరామయ్య పదవికి గండం తీసుకు వస్తుందని కర్ణాటక రాజకీయవర్గాలు భావించాయి. అయితే విచారణకు ఆదేశించిన లోకాయుక్తనే .. ముడా వ్యవహారంలో .. ఆధారాలు లేవని చెప్పడంతో.. మొత్తం కేసు తేలిపోయినట్లయింది..
Also Read: ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్ న్యూస్, విజయవాడ రూట్‌లో వెళ్లేవారికి రాయితీ ప్రకటన
మరిన్ని చూడండి