Maha Shivaratri Special Celebrations at Isha Foundation Journey Details from Hyderabad to Isha

Isha Foundation Celebrations 2025 : హిందువులు భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ మహా శివరాత్రి (Maha Shivaratri 2025). శివ, పార్వతుల వివాహం జరిగిన రోజుకు ప్రతీకగా దీనిని చేసుకుంటారు. ప్రతి నెలలో ఓ శివరాత్రి ఉంటుంది. దీనిని మాస శివరాత్రి అంటారు. అయితే చలికాలం చివర్లో మాఘమాసంలో వచ్చే శివరాత్రిని మహాశివరాత్రి అంటారు. హిందువుల పండుగలలో మహాశివరాత్రికి ప్రత్యేక స్థానం ఉంది. దీనిని భక్తులు అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు.

ఈ ఏడాది మహాశివరాత్రి ఫిబ్రవరి 26వ తేదీన వస్తుంది. ఈ సందర్భంగా భక్తులు ఉపవాసం, జాగారం చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఈ పండుగను చాలామంది ఈషా ఫౌండేషన్​లో సెలబ్రేట్ చేసుకుంటారు. సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకు, ఇతర దేశ ప్రజలు కూడా ఈషాలో మహా శివరాత్రి సెలబ్రేషన్స్ చేసుకుంటారు. మీరు కూడా హైదరాబాద్ నుంచి ఈషాకు వెళ్లాలనుకుంటే ఇది ఫాలో అయిపోండి.

హైదరాబాద్ నుంచి.. 

హైదరాబాద్ నుంచి ఈషాకు వెళ్లాలనుకుంటే.. కోయంబత్తూరు వెళ్లాలి. దీనికోసం రోజూ ఓ ట్రైన్ ఉంటుంది. సబరి ఎక్స్​ప్రెస్ (17230) వెళ్లొచ్చు. లేదంటే బస్సు ద్వారా లేదా కారులో కూడా వెళ్లొచ్చు. అక్కడ స్టేయింగ్​కి చాలా ఆప్షన్ ఉంటాయి. లేదంటే ఈషాలోనే స్టే చేయవచ్చు. కానీ ముందే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే కోయంబత్తూర్​లో స్టే చేసి.. ఈషాకి బస్​లో వెళ్లొచ్చు. ఉదయం 5.30 నుంచి 8వరకు బస్​లు అందుబాటులో ఉంటాయి. 

ఈషాలో జరిగే ఉత్సవాలు ఇవే.. 

హిందువులు పరమ పవిత్రంగా జరుపుకునే ఈ మహాశివరాత్రిని ఈషాలో ఘనంగా చేస్తారు. యోగ సంప్రదాయానికి మూలమైన ఆది గురువు లేదా మొదటి గురువైన శివుని అనుగ్రహం పొందే రోజుగా భావించి.. దానికి సంబంధించిన కార్యక్రమాలు అక్కడ జరుపుతారు. ఈషా యోగా కేంద్రంలో రాత్రంతా అద్భుతమైన ఈవెంట్ చేస్తారు. పలు ప్రదర్శనలను ప్రత్యక్షంగా వెబ్​ ద్వారా కూడా భక్తులకు అందుబాటులో ఉంటాయి. సద్గురు ధ్యానాలు, ప్రఖ్యాత కళాకారులతో అద్భుతమైన సంగీత ప్రదర్శనలు రాత్రంతా కొనసాగుతాయి. ఈ ఏడాది మార్షల్ ఆర్ట్స్ సాంప్రదాయ ప్రదర్శనలు కూడా చేయనున్నారు. ఈశా సంస్కృతి విద్యార్థులు వీటిని నిర్వహిస్తారు. అనంతరం ఆదియోగి దివ్య దర్శనం ఉంటుంది. మొత్తంగా మహాశివరాత్రి రోజు ఆధ్యాత్మిక అనుభవం మీ సొంతమవుతుంది. 

శివ జాగరణ ఎలా ఉండాలంటే.. 

మహా శివరాత్రికి జాగారణ ఈషా వెళ్లకున్నా జాగరణ చేయవచ్చు. అయితే దీనిని కొందరు తప్పుగా అర్థం చేసుకుని రాత్రంతా మేల్కొని ఉండేందుకు వివిధ మార్గాలు ఎంచుకుంటారు. అవి అస్సలు జాగరణలోకే రావట. జాగరణ అంటే తమో గుణమునకు వశము కాకుండా ఉండడం. అంటే నిద్రపోకుండా ఉండడం. అయితే నిద్రపోకుండా ఉండేందుకు వేదం ఎలాంటి పనులు వద్దని చెప్పిందో.. అలాంటిపనులు చేస్తూ మేల్కొని ఉంటే అది జాగరణ కాదట. అంతర్మఖుంతో ఉన్నవాడు లోకమంతా విశ్రాంతి తీసుకున్న వేళ తెలివిగా ఉండడమే జాగరణకు అర్థం.

అజ్ఞానమునకు వశపడకుండా ఉంటూ.. శివునికి దగ్గరగా ఉండడమే శివరాత్రి జాగరణ. దీనిని చేయడానికి ఈశ్వారానుగ్రహం ఉండాలి అంటారు. ఇంద్రీయాలతో భగవన్మామస్మరణలో గడపడమే జాగరణ. అర్థరాత్రి వేళ జ్యోతిర్లింగం ఆవిష్కరణ తర్వాత.. జాగరణ ముగుస్తుంది. ఇలా నిగ్రహంగా ఉంటూ.. నిద్రకు స్వతాహగా రాకుండా.. ఉపవాసం చేస్తూ జాగరణ చేయాల్సి ఉంది కాబట్టే జన్మానికొక్క శివరాత్రి అంటారు. దీనిని చేయడం కష్టమే కానీ.. శివుని మనసులో పెట్టుకుని చేస్తే కచ్చితంగా సాధ్యమవుతుంది.  

Also Read : మహా శివరాత్రి ఉపవాస నియమాలు.. ఉపవాసం అంటే అర్థమదే, దోషం లేకుండా ఎలా చేయాలో తెలుసా?

మరిన్ని చూడండి

Source link