ByGanesh
Wed 25th Dec 2024 09:55 AM
మహారాజ సినిమాతో విజయ్ సేతుపతి తమిళనాటే కాదు, తెలుగులోనూ పెద్ద హిట్ కొట్టారు, అంతేకాదు ఈమధ్యన చైనాలోను బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. 100ల కోట్లు మహారాజ కొల్లగొట్టింది. దానితో విజయ్ సేతుపతి రేంజ్ బాగా పెరిగిపోయింది. అదే అంచనాలతో విజయ్ సేతుపతి నుంచి రీసెంట్ గా అంటే డిసెంబర్ 20 న విడుదల 2 వచ్చింది.
విడుదల చిత్రానికి సీక్వెల్ గా వెట్రిమారన్ తెరకెక్కించిన విడుదల 2 గత వారమే విడుదలయ్యింది. విడుదల పార్ట్ 1 బాగా హిట్ అవడంతో విడుదల 2 పై అంచనాలు ఏర్పడ్డాయి. కానీ విడుదల సీక్వెల్ విడుదల 2 అనుకున్నంతగా అంచనాలను రీచ్ అవ్వలేదు. విడుదల పార్ట్ 2 ప్రేక్షకులకు రుచించలేదు. దానితో ఈ చిత్రానికి దారుణమైన కలెక్షన్స్ వస్తున్నాయి.
కోలీవుడ్ లో ఓకె అనిపించినా మిగతా భాషల్లో విడుదల 2 అంతగా ప్రేక్షకులను ఇంప్రెస్ చెయ్యలేదు. దానితో విడుదల పార్ట్ 2 డిజాస్టర్ దిశగా పరుగులు పెడుతుంది. మహారాజాకు విడుదల 2 పెద్ద షాక్ ఇచ్చింది అని చెప్పాలి. థియేటర్స్ లో ఆకట్టుకోలేని విడుదల 2 ఓటీటీ పెరఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూడాలి.
Maharaja shocked VIdudala 2:
Vijay Sethupathi VIdudala 2 result