Maharashtra MLA Geeta Jain Slapped A Junior Civic Engineer In Public, Video Goes Viral

Viral Video: 

సోషల్ మీడియాలో వైరల్..

మహారాష్ట్రలో ఓ మహిళా ఎమ్మెల్యే ఇంజనీర్‌ని రోడ్డుపైనే నిలబెట్టి చెంప దెబ్బలు కొట్టడం సంచలనమైంది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. జూనియర్ సివిల్ ఇంజనీర్ కాలర్ పట్టుకుని మరీ కొట్టారు ఎమ్మెల్యే గీతా జైన్ (Geeta Jain). థానే జిల్లాలోని మీరా భయందర్‌ ఎమ్మెల్యే అయిన ఆమె కొట్టడమే కాదు. “యూజ్‌లెస్‌” అంటూ గట్టిగా ఆ ఇంజనీర్‌పై అరిచింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఓ ఇంట్లోని వాళ్లను బయటకు పంపించి కూల్చేశారు. మహిళలు, చిన్నారులు రోడ్డున పడ్డారు. అక్కడే ఉండాలని అధికారులు హెచ్చరించి మరీ ఇల్లు కూల్చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ ఎమ్మెల్యే నడిరోడ్డుపైనే ఇంజనీర్‌ని నిలదీశారు. ఆ తరవాత చెంప దెబ్బ కొట్టారు. ఎందుకలా కొట్టారని మీడియా ప్రశ్నించగా…వివరణ ఇచ్చారు గీతా జైన్. 

“ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇల్లు కూల్చేశారు. మహిళ, చిన్నారులు రోడ్డున పడ్డారు. ఇల్లు కూల్చేస్తుంటే వాళ్లు బోరున ఏడ్చారు. వాళ్లను చూసి ఈ సివిల్ ఇంజనీర్ నవ్వుకున్నాడు. అందుకే వెంటనే కొట్టాలనిపించింది. కొట్టాను. ఇలాంటి పరిస్థితుల్లో ఇలా స్పందించడం చాలా సహజం. కేవలం ఓ బిల్డర్‌కి ఈ ఇల్లు అడ్డు తగులుతోందనే కూల్చేశారు తప్ప ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరాలు లేవు. అయినా…ఈ ఇంజనీర్ అత్యుత్సాహం చూపించి కూల్చేశారు”

– గీతా జైన్, ఎమ్మెల్యే

అంతే కాదు. ఇల్లు కూల్చేస్తున్న సమయంలో మహిళ అడ్డుకుందని, ఆమెను జుట్టు పట్టుకుని ఈడ్చేశారని ఆరోపించారు ఎమ్మెల్యే గీతా జైన్. ఆ ఇంజనీర్‌ని కొట్టినందుకు ఎలాంటి రిగ్రెట్ లేదని తేల్చి చెప్పారు. ఈ అంశాన్ని అసెంబ్లీలోనూ ప్రస్తావిస్తామని వెల్లడించారు. 

“మొత్తం ఇద్దరు ఇంజనీర్‌లు కలిసి ఈ పని చేశారు. అసెంబ్లీలో కూడా ఈ అంశం గురించి ప్రస్తావిస్తాను. నాపైన కేసు పెడితే పెట్టనివ్వండి. దేన్నైనా ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రైవేట్ ల్యాండ్‌లోని ఇంటితో అధికారులకు ఏం పని. అలా ఎలా కూల్చేస్తారు”

– గీతా జైన్, ఎమ్మెల్యే 

Source link