ByKranthi
Wed 09th Aug 2023 07:13 AM
అన్ని సజావుగా నడిచినట్లయితే.. మహేష్ బాబు ‘గుంటూరు కారం’ టీజర్ వ్యూస్, లైక్స్ లెక్కలెట్టుకుంటూ ఉండే వారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. కానీ మొదలైన ముహూర్తం బాగాలేదో ఏమో గానీ ‘గుంటూరు కారం’కు అన్నీ అడ్డంకులే. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి రోజూ ఎవరో ఒకరు ఈ సినిమా నుంచి వెళ్లిపోయినట్లుగా వార్తలు, ఉన్నవాళ్లతో చేయడానికి మహేష్ ఇంట్రస్ట్ చూపించడం లేదనేలా రాతలు.. వెరసీ షూటింగ్ అయితే వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది. అన్నీ సమకూరి సక్రమంగా షూటింగ్ జరుగుతుందని మేకర్స్ చెబుతున్నప్పటికీ.. సోషల్ మీడియా ప్రభావంతో.. చీమ చిటుక్కుమంటే చాలు సినిమాకు సంబంధించిన చిన్న విషయం కూడా బయటికి వచ్చేస్తుంది.
ఇక విషయంలోకి వస్తే.. నేడు (ఆగస్ట్ 09) సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు. ఈ పుట్టినరోజుకి మాములుగా అయితే నిర్మాత నాగవంశీ చెప్పిన ప్రకారం టీజర్ రావాలి. కానీ ఈ సినిమా షూటింగ్ నడిచిన తీరు తెలిసిన మహేష్ బాబు ఫ్యాన్స్ దానిపై ఎప్పుడో ఆశలు వదిలేసుకున్నారు. అసలు ఏదైనా అప్‌డేట్ ఇస్తారో.. లేదో అనేంతగా వారు డౌట్‌లో ఉన్నారు. అలాంటి సమయంలో స్వయంగా నాగవంశీ ట్విట్టర్ వేదికగా ఫ్యాన్స్‌కి ట్రీట్ ఉంది.. అర్థరాత్రి 12 గంటల 06 నిమిషాలకు రివీల్ చేస్తామంటూ చెప్పడంతో.. ఫ్యాన్స్ ఓ సాంగ్ బిట్ ఏదైనా వదులుతారేమోనని ఊహించారు. కానీ ఓ పోస్టర్ వదిలి.. ఈసారికి దీంతో సరిపెట్టుకోండమ్మా.. అని సర్దేశారు.
అయితే పోస్టర్ మాత్రం కిర్రాక్ పోస్టర్ వదిలారు. నీరసంలో ఉన్న వారికి సెలైన్ బాటిల్ ఎక్కించినట్లుగా.. వచ్చిన పోస్టర్ ఊర మాస్ లుక్‌లో ఒక్కసారిగా వారికి హుషారుని ఇచ్చేసింది. అందులోనూ లుంగీ సెంటిమెంట్. మహేష్ బాబు లుంగీ కడుతున్న సినిమాలు ఈ మధ్య హిట్టవుతున్నాయి. మరి ఆ సెంటిమెంట్ కోసమో.. లేదంటే.. సినిమా ఊర మాస్‌గా ఉండబోతుందని చెప్పడానికో తెలియదు కానీ.. బర్త్‌డే ట్రీట్‌గా ఈ పోస్టర్‌తో ఫ్యాన్స్‌ని బాగానే శాటిస్‌ఫై చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Mahesh Babu Birthday Special Poster From Guntur Kaaram Out:
Fans Happy with Mahesh Babu Birthday Special Poster From Guntur Kaaram