Malayalam Industry Delivered Another Blockbuster మలయాళం నుంచి మరో సెన్సేషన్


Thu 27th Feb 2025 07:24 PM

officer on duty  మలయాళం నుంచి మరో సెన్సేషన్


Malayalam Industry Delivered Another Blockbuster మలయాళం నుంచి మరో సెన్సేషన్

కొన్నాళ్లుగా మలయాళం నుంచి వస్తున్న చిత్రాలు మలయాళంలో కాసులు కురిపించడమే కాదు, మలయాళ ఇండస్ట్రీ కి మంచి పేరు తీసుకొస్తున్నాయి. సింపుల్ స్టోరీస్ తో ఆడియన్స్ ను అద్భుతంగా ఆకట్టుకుంటున్నాయి. మలయాళ చిత్రాలు ఓటీటీ ల ద్వారా ఇతర భాషల్లో డబ్ అయ్యి పలు భాషల ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నాయి. 

ఆ లిస్ట్ లో తాజాగా మరో మలయాళ చిత్రం చేరింది. కుంచాకో బోబన్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఆఫీసర్ ఆన్ డ్యూటీ రీసెంట్ గా విడుదలై వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ఫిబ్రవరి 20 న మలయాళంలో విడుదలై నాలుగు రోజులు తిరిగేసరికి బ్రేక్ ఈవెన్ అవ్వడమే కాదు నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టింది. 

ఆరు రోజుల్లోనే 25 కోట్ల కలెక్షన్లు వసూలు చేసి మలయాళంలో ఈ ఏడాది అతిపెద్ద గ్రాసర్ చిత్రాల్లో రెండవదిగా నిలిచింది. 12 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఆఫీసర్ ఆన్ డ్యూటీ వారం తిరక్కుండానే 25 కోట్లు కలెక్ట్ చేసింది. 


Malayalam Industry Delivered Another Blockbuster:

Officer on Duty Is The Latest Mollywood Blockbuster





Source link