Teachers Kissing In School In Rajasthan: పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన టీచర్లే దారి తప్పారు. దేవాలయం వంటి పాఠశాలనే తమ అసభ్య కార్యకలాపాలకు కేంద్రంగా మార్చేశారు. రాజస్థాన్‌లోని (Rajasthan) చిత్తోర్‌గఢ్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో మహిళా ఉపాధ్యాయురాలితో ఓ ఉపాధ్యాయుడు రాసలీలల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ఉన్నతాధికారులు ఇద్దరిపైనా సస్పెన్షన్ వేటు వేశారు. కాగా, పాఠశాల స్టాఫ్ రూమ్‌లో కొద్ది రోజులుగా సాగుతున్న వీరి అసభ్య కార్యకలాపాలకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ టీవీ కెమెరాలో రికార్డయ్యాయి.
ఒకరికొకరు ముద్దులు పెట్టుకుంటూ హద్దులు మీరి రొమాన్స్ చేసిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు ఇద్దరిపైనా సస్పెన్షన్ వేటు వేశారు. ఈ మేరకు డీఈవో ఉత్తర్వులు జారీ చేశారు. స్కూల్‌లో ఉపాధ్యాయురాలితో టీచర్ రాసలీలల వ్యవహారం వెలుగుచూడడంతో గ్రామస్థులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలకు పాఠాలు నేర్పించాల్సిన చోట ఇలాంటి పనులేంటని మండిపడుతున్నారు. ఇద్దరిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read: Kumbh Mela 2025: ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాలో అగ్ని ప్రమాదం – భయంతో పరుగులు తీసిన భక్తులు
మరిన్ని చూడండి