Dating App Scam: డేటింగ్ యాప్ మోసాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. చాలా సులువుగా వలలో చిక్కుకుని లక్షల కొద్దీ పోగొట్టుకుంటున్నారు. ఢిల్లీలో ఇలాంటి ఘటనే జరిగింది. సివిల్ సర్వీసెస్‌కి ప్రిపేర్ అవుతున్న ఓ యువకుడు టిండర్‌లో పరిచయమైన యువతిని నమ్మి నిండా మునిగాడు. యువతి బర్త్‌డేని సెలబ్రేట్ చేసేందుకు కేఫ్‌కి వచ్చాడు. ఇద్దరూ కేక్‌లతో పాటు నాన్ ఆల్కహాలిక్ డ్రింక్స్ ఆర్డర్ చేశారు. అప్పటి వరకూ బాగానే ఉన్న యువతి ఉన్నట్టుండి అక్కడి నుంచి వెళ్లిపోతానని చెప్పింది. ఫ్యామిలీలో ఎవరికో బాలేదని, ఎమర్జెన్సీ అని నమ్మించింది. ఇక బిల్ కట్టేసి వెళ్లిపోదామనుకున్న యువకుడికి షాక్ తగిలింది. నాలుగు కేక్‌లు, నాలుగు షాట్స్ డ్రింక్స్‌కే రూ.1.21 లక్షల బిల్ వేశారు. మహా అయితే నాలుగైదు వేలల్లో ఉండే బిల్ ఇలా లక్ష దాటే సరికి యువకుడు కళ్లు తేలేశాడు. వెంటనే కౌంటర్ దగ్గరికెళ్లి కేఫ్ సిబ్బందితో గొడవ పడ్డాడు. చాలా సేపు వాగ్వాదం జరిగింది. చివరకు బిల్ కట్టకపోతే చంపేస్తామని బెదిరించడం మొదలు పెట్టారు. చేసేదేమీ లేక బాధితుడు ఆన్‌లైన్‌లో అమౌంట్ ట్రాన్స్‌ఫర్ చేశాడు. ఆ తరవాత నేరుగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కంప్లెయింట్ ఇచ్చాడు.
నలుగురు పోలీసులు వెంటనే విచారణ మొదలు పెట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తరవాత అసలు కథంతా తెలిసింది. ఆ యువతి పేరుతో పాటు వివరాలన్నీ ఫేక్ అని తేలింది. వీళ్లంతా కుమ్మక్కై బాధితుడిని దోచుకున్నారని తెలిసింది.
వెంటనే ఆ యువతిపై నిఘా పెట్టిన పోలీసులు మరో కేఫ్‌లో వేరే అబ్బాయితో ఉండగా గుర్తించి అరెస్ట్ చేశారు. బాధితుడి నుంచి తీసుకున్న బిల్లులో వాటాలు వేసుకుని పంచుకున్నారని గుర్తించారు. అయితే…ఈ కేసులో యువతితో పాటు మరో నిందితుడు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఢిల్లీలోనే కాదు. ముంబయి, బెంగళూరు, హైదరాబాద్ సహా పలు కీలక నగరాల్లో ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి. డేటింగ్ యాప్స్ ద్వారా ఇలా డబ్బున్న కుర్రాళ్లని టార్గెట్ చేసి బలవంతంగా డబ్బులు గుంజుతున్నాయి ముఠాలు. ఆన్‌లైన్‌లో ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేస్తున్నారు.
మరిన్ని చూడండి