Man with sexsomnia found not guilty of raping woman in Sydney: ఓ రోజు ఓ అపార్టుమెంట్‌లో ఓ మగ వ్యక్తి, మరో మహిళ ఉన్నారు. ఇద్దరూ మద్యం మత్తులో ఉన్నారు. నిద్రపోయారు. ఉదయం లేచే సరికి ఆ మగ వ్యక్తి తనపై అత్యాచారం చేశాడని ఆ మహిళ గుర్తించింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు పెట్టారు. పోలీసులు ఆధారాలు సేకరించారు. అతని వీర్యం .. డీఎన్‌ఏ సేకరించారు. ఇక దొరికపోతానని అనుకున్న సమయంలో అత్యాచారం చేసింది నిజమే కానీ.. అది తనకు తెలియని స్థితిలో ఆ అత్యాచారం జరిగిందని తనకు సెక్సోసోమ్నియా ఉందని ఆ నిందితుడు వాదించాడు. తనకు తెలియని స్థితిలో ఈ నేరం జరిగింది కాబట్టి తనకు ఏ పాపం తెలియదన్నాడు. ఈ వాదనతో సిడ్నీ కోర్టు కూడా ఏకీభవించింది. అతని తప్పు లేదని తెలిపింది. ఇప్పుడీ కేసు తీర్పు హాట్ టాపిక్ గామారిందది.
సిడ్నీకి చెందిన 40 ఏళ్ల తిమోతి మాల్కం రోలాండ్ అనే వ్యక్తి ఒక మహిళపై అత్యాచారం చేసిన కేసులో దోషిగా తేలాడు. 2022లో తన సిడ్నీ అపార్ట్‌మెంట్‌లో ఇద్దరూ కలిసి ఒక రాత్రి గడిపినప్పుడు.. రోలాండ్.. మహిళ సమ్మతి లేకుండా లైంగిక చర్యకు దిగాడు. ఆ రోజున వారిద్దరూ ఓ పార్టీకి వెళ్లారు. రాత్రి ఒంటి గంట ప్రాంతంలో కాక్‌టెయిల్ పార్టీ తర్వాత అతని అపార్ట్‌మెంట్‌కు వెళ్లారనిు. ఇద్దరూ మరికొంత మద్యం సేవించారు. తర్వాత ఇద్దరూ నగ్నంగా స్నానం చేశారు. ఆ మహిళ కూడా మద్యం మత్తులో ఒకే మంచంపై పడుకున్నారు. ఉదయం 6 గంటల ప్రాంతంలో, ఆ మహిళ మేల్కొని రోలాండ్ తనతో లైంగిక చర్య చేశాడన గుర్తించి పోలీసుకు ఫిర్యాదు చేశారు.
తన సమ్మతి లేకుండా తనను శారీరకంగా అనుభవించాడని ఆమె నిరూపించింది. అయితే తనకు సెక్స్‌సోమ్నియా అనే వ్యాధి ఉందని రోలాండ్ కోర్టు ముదు వాదించారు. ఇది నిద్రలో నడిచే అలవాటు లాగా.. నిద్రపోతున్నప్పుడు పక్కన ఉన్న వారిపై తన ప్రమేయం లేకుండా శృంగారం చేసే వ్యాధిగా వైద్య పరిబాషలో చెబుతారు. ఇలాంటి వ్యాధి తనకు ఉందని రోలాండ్ వాదించారు.ఇది చాలా ప్రమాదకరమైన వాదన అని న్యాయమూర్తి అంగీకరించారు కానీ.. ఎవరైనా తెలియకుండానే చేసిన నేరానికి దోషిగా నిర్ధారించలేరని న్యాయమూర్తి తేల్చారు. “వారికి చట్టబద్ధమైన నియంత్రణ లేని చర్యలకు మేము వారిని శిక్షించబోవడం లేదు” అని న్యాయమూర్తి తీర్పు చెప్పారు.
సెక్సోస్మానియా గురించిఎటువంటి చట్టాలు లేవు. దాని గురించి ఎటువంటి క్రిమినల్ నేరాలు లేవన్నారు. రేప్ చేస్తున్నప్పుడు రోలాండ్ నిద్రలో ఉన్నాడని ఎలా ప్రూవ్ చేయగలరన్న ప్రశ్న వచ్చింది. అతను నిద్రపోలేదని తగినంత ఆధారాలు అందుబాటులో ఉంటే కేసు కొనసాగించవచ్చని పేర్కొన్నారు. అలాంటి ఆధారాలు లేవు కాబట్టి కేసును కొనసాగించాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పుడు అత్యాచారం చేసిన వాళ్లంతా తమకు సెక్సోసోమ్నియా ఉందని వాదిస్తే పరిస్థితి ఏమిటన్న చర్చ విస్తృతంగా నడుస్తోంది.
Also Read: జిమ్ములోనే క్లైంట్లతో జిమ్ ట్రైనర్ శృంగారం – వీడియోలు వైరల్ – పదుల సంఖ్యలో కాపురాల్లో చిచ్చు
మరిన్ని చూడండి