Manchu Manoj Complaints Against Mohan Babu తండ్రి కొట్టడంటూ మంచు మనోజ్ ఫిర్యాదు


Sun 08th Dec 2024 11:51 AM

manchu manoj  తండ్రి కొట్టడంటూ మంచు మనోజ్ ఫిర్యాదు


Manchu Manoj Complaints Against Mohan Babu తండ్రి కొట్టడంటూ మంచు మనోజ్ ఫిర్యాదు

కొన్నాళ్లుగా మంచు ఫ్యామిలిలో ఆస్తి తగాదాలు జరుగుతున్నాయి. అన్నదమ్ములైన మంచు విష్ణు-మంచు మనోజ్ మద్యన పచ్చగడ్డి వేస్తె భగ్గుమంటుంది. పదిమందికి న్యాయం చెప్పే మంచు మోహన్ బాబు కొడుకుల విషయంలో పంచాయితీ చెయ్యలేక నలిగిపోతున్నారు. మనోజ్ పెళ్లి సమయంలోను వారి మద్యన ఉన్న మనస్పర్థలు స్పష్టం గా కనిపించాయి. తమ్ముడు మనోజ్ కి సపోర్ట్ చేస్తున్నాడంటూ విష్ణు ఒకరి మీద దాడి చెయ్యడం అప్పట్లో సంచలనం అయ్యింది. 

ఇప్పడు ఈ ఆస్తి తగాదాలు తారాస్థాయికి చేరడం హాట్ టాపిక్ అవడం కాదు తండ్రి మోహన్ బాబు పై మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే, కొడుకు మనోజ్ పై మోహన్ బాబు కంప్లైంట్ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. తండ్రి తనని కొట్టాడని మంచు మనోజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చెయ్యడమే కాదు.. 

మనోజే తనపై దాడి చేశాడని కొడుకు పై ఫిర్యాదు చేసిన మోహన్ బాబు. ఆస్తుల, స్కూలు వ్యవహారంలో తండ్రీకొడుకులు పరస్పరంగా దాడులు చేసుకుని, గాయాలతో పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేసిన మంచు మనోజ్.. తనతో పాటు తన భార్యపై దాడి చేశారని మోహన్ బాబు పై మంచు మనోజ్ ఫిర్యాదుచేసాడు. కాదు తనపై మనోజ్ తిరగబడ్డాడు అంటూ మోహన్ బాబు మనోజ్ పై కంప్లైంట్ చేసారు. 

అయితే అంచు పిఆర్ టీం మాత్రం మోహన్ బాబు గారు మంచుమనోజ్ పరస్పర ఫిర్యాదులు చెసుకున్నారనే వార్తల్లో నిజం‌ లేదు. మంచు మనోజ్ దెబ్బలతో వచ్చి మరీ పొలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తున్నట్లు ఊహాజనితమైన కధనాలను.. కొన్ని మీడియా చానెల్స్ అసత్య ప్రచారాలు చేస్తున్నాయి.. వాటిలో నిజం లేదు.‌. అంటూ కొట్టిపారేస్తున్నాయి. 


Manchu Manoj Complaints Against Mohan Babu:

Mohan Babu Vs Manchu Manoj





Source link