Mangalagiri : మంగళగిరిలో ఉచిత ఎలక్ట్రిక్ బస్సు సేవలు అందుబాటులోకి వచ్చాయి. రెండు సర్వీసులు అందుబాటులోకి రాగా.. అందులో ఒకటి ఎయిమ్స్‌కు, మరొకటి పానకాల లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి రాకపోకలు నిర్వహిస్తున్నాయి. రెండు ఉచిత ఎలక్ట్రిక్ బస్సు సేవలను మంత్రి నారా లోకేష్ జెండా ఊపి ప్రారంభించారు.