Manipur Violence Oppositon Leaders Meet President, Submits Memorandum On Manipur Issue

Manipur Violence: 

రాష్ట్రపతితో భేటీ..

ఇండియా కూటమికి చెందిన 21 మంది నేతలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలో ఈ నేతలు మణిపూర్ అంశంపై రాష్ట్రపతికి మెమొరాండం అందించారు. ప్రధాని మోదీ మణిపూర్‌లో పర్యటించాలని డిమాండ్ చేశారు. అక్కడి శాంతి భద్రతల్ని అదుపులోకి తీసుకురావాలని మెమొరాండంలో పేర్కొన్నట్టు వెల్లడించారు ఖర్గే. పార్లమెంట్‌లో ప్రధాని మోదీ ఈ అల్లర్లపై మాట్లాడాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి విపక్షాలు. ఇందులో భాగంగానే…రాష్ట్రపతితో భేటీ అయ్యారు. 

“ఇండియా కూటమి తరపున 21 మంది నేతలం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిశాం. అక్కడి పరిస్థితేంటో ఆమెకు వివరించాం. ఇదే అంశంపై ఓ మెమొరాండం ఇచ్చాం. మహిళలపై ఎన్ని దారుణాలు జరుగుతున్నాయో చెప్పాం. అక్కడి పునరావాస కేంద్రాలూ సరిగా లేవు. ఇదే విషయాన్ని రాష్ట్రపతికి వివరించాం. మాది ఒకటే డిమాండ్. పార్లమెంట్‌లో ప్రధాని మోదీ మణిపూర్ హింసపై చర్చించాలి. అక్కడ శాంతియుత వాతావరణం నెలకొనేలా చొరవ చూపించాలి. మా డిమాండ్‌లను పరిశీలిస్తామని రాష్ట్రపతి హామీ ఇచ్చారు. “

– మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు 

Source link