Anju Nasrullah In India: ఫేస్ బుక్ ప్రియుడి (Facebook Lover) కోసం రాజస్థాన్ (Rajasthan Women) నుంచి పాకిస్తాన్ వెళ్లిన అంజూ (Anju Nasrullah) అనే మహిళ గుర్తుందా? కొన్ని నెలల క్రితం ఆమె చేసిన పని ఇండియా అంతా ట్రెండింగ్ అయ్యింది. ఇప్పుడు ఆమె గురించి ఎందుకు అనుకుంటున్నారా? ఆమె తాజాగా ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చింది. తన పిల్లలపై బెంగగా ఉందని, వారిని చూసి పలకరించి వెళ్లేందుకు భారత (India) గడ్డపై అడుగుపెట్టిందట. ఆమె మంగళవారం అర్థరాత్రి మొహానికి ముసుగు వేసుకుని అట్టారీ-వాఘా సరిహద్దు (Attari Wagah Border) గుండా భారత్‌లోకి ప్రవేశించింది.
అయితే ఆమె ఇంకా రాజస్థాన్‌లోని తన స్వగ్రామానికి చేరుకోలేదు. ఇండియా ఎందుకు వచ్చావని అడిగన ప్రశ్నకు సమధానామిస్తూ.. తాను సంతోషంగా ఉన్నానని చెప్పడానికి ఏమీ లేదని చెప్పింది. ప్రస్తుతం తన మాజీ భర్త అరవింద్ తన ఇద్దరు పిల్లలతో ఎక్కడ నివసిస్తున్నాడో ఎవరికీ తెలియదు. వారిని చేరుకుని పిలల్లను చూడాలని అంజూ ఆశపడుతోంది.
#WATCH | Amritsar, Punjab: Anju, who had travelled to Pakistan in July returns to India
“I am happy…I have no other comments”, says Anju pic.twitter.com/vKPUTsx4jx
— ANI (@ANI) November 29, 2023
రాజస్థాన్‌కు చెందిన అంజు అనే మహిళ జులై నెలలో తన భర్త, ఇద్దరు పిల్లలను వదిలిపెట్టి తన ప్రేమికుడు నస్రుల్లాను కలవడానికి పాకిస్థాన్ కు వెళ్లింది. అక్కడ ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోని అప్పర్ దిర్ జిల్లాలో తిరుగుతూ ప్రియుడితో ఎంజాయ్ చేసింది. గత జులై 25న అంజు వివాహం చేసుకున్నారు. దానికి ముందు ఆమె హిందూ మతం నుంచి ఇస్లాంలోకి మారి ఫాతిమాగా పేరు మార్చుకున్నారు.
ఆ జంటకు అక్కడ రియల్ ఎస్టేట్ సంస్థ యజమాని మొహసీన్ ఖాన్ అబ్బాసీ కొంత భూమి, నగదును బహుమతిగా ఇచ్చాడు. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సు అప్పర్ దిర్ జిల్లాలోని ఓ గ్రామంలో వారు నివసిస్తున్నారు. అంజూ సరిహద్దులు దాటి వెళ్లడం, అక్కడ ప్రియుడు నస్రుల్లాను పెళ్లాడటాన్ని మధ్యప్రదేశ్ ప్రభుత్వంసీరియస్ గా తీసుకుంది. ఆమె పాకిస్తాన్ వెళ్లడం వెనుక అంతర్జాతీయ కుట్రపై తెలుసుకునేందుకు దర్యాప్తునకు ఆదేశించింది. అంజూ తన భర్తకు విడాకులు ఇవ్వకుండానే పాక్‌కు వెళ్లింది.
ఫేస్‌బుక్ స్నేహితుడి కోసం పాకిస్థాన్ వెళ్లిన భారతీయ మహిళ అంజు త్వరలోనే భారత్ కు వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. పాకిస్తాన్ వెళ్లిన తర్వాత ఖైబర్ పఖ్తుంక్వా ప్రావిన్స్‌లోని అప్పర్ దిర్ జిల్లాకు చెందిన 29 ఏళ్ల నస్రుల్లాను, గత జులై 25న అంజు వివాహం చేసుకున్నారు. దానికి ముందు ఆమె హిందూ మతం నుంచి ఇస్లాంలోకి మారి ఫాతిమాగా పేరు మార్చుకున్నారు.
ఎన్వోసీకి దరఖాస్తు చేసుకున్న అంజూ
ఆగస్టులో ఆమెకు పాక్ ప్రభుత్వం ఏడాది చెల్లుబాటయ్యే వీసాను మంజూరు చేసింది. తన పిల్లలు పదే పదే గుర్తుకు వస్తుండటంతో ఇండియా రావాలని భావించింది. పాక్ ప్రభుత్వం నుంచి నిరభ్యంతర పత్రం రాగానే ఆమె భారత్‌లో పర్యటిస్తారని ఆమె పాకిస్థాన్ భర్త నస్రుల్లా గతంలో వెల్లడించారు. ఇప్పటికే ఎన్‌వోసీ కోసం ఇస్లామాబాద్‌లోని హోంశాఖకు దరఖాస్తు చేశామని తెలిపారు. భారత్‌లో తన ఇద్దరు పిల్లలను కలుసుకుని, క్షేమ సమాచారాలు తెలుసుకున్నతర్వాత తిరిగి అంజు పాకిస్థాన్‌కు చేరుకుంటుందన్నారు.