పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పై ప్రస్తుతం భారీ ట్రోలింగ్ జరుగుతుంది. ప్రభాస్ బాహుబలి తర్వాత తన సినిమాల్లో ఎక్కువగా డూప్ లపై ఆధారపడుతున్నారంటూ, కల్కి చిత్రంలో అమితాబ్ తో ప్రభాస్ పోరాటాలు ఎంత హైలెట్ అయ్యాయో, ఇప్పుడా యాక్షన్ సీక్వెన్స్ లో అమితాబ్ తో పోటీపడింది ప్రభాస్ కాదు, ఆయన డూప్ అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
కల్కి చిత్రంలో యాక్షన్ సీన్స్ కి చాలామంచి రెస్పాన్స్ వచ్చింది. అమితాబ్-ప్రభాస్ నడుమ జరిగే పోరాట ఘట్టాలు నార్త్ ఆడియన్స్ కు బాగా నచ్చేసాయి. కల్కి ఓవరాల్ గా 1100 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టింది. అయితే అమితాబచ్ఛన్-ప్రభాస్ నడుమ జరిగే యాక్షన్ సీక్వెన్స్ వీడియోను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ.. ఇదంతా ఫేక్, యాక్షన్ సీక్వెన్స్ కోసం ప్రభాస్ బాడీ డబుల్ వాడాడు అంటూ ట్రోల్ చేస్తున్నారు.
బాడీ డబుల్స్ మాత్రమే కాదు, డీప్ ఫేక్ టెక్నాలజీని వాడారు, ప్రశాంత్ నీల్, నాగ్ అశ్విన్ లాంటి దర్శకులు ప్రభాస్ క్లోజప్ షాట్స్ తీసుకుని 80 శాతం షూటింగ్ ను ఇలాంటి బాడీ డబుల్స్, డీప్ ఫేక్ వీడియోస్ తోనే ముగిస్తారు, ప్రభాస్ ను వాడుకోవడంలో వీరికి మించి ఎవరు చెయ్యలేరంటూ కామెంట్స్ పెడుతున్నారు.
యాక్షన్ సీక్వెన్స్ లో బాడి డబుల్స్ వాడడం అనేది కామన్ పాయింట్. ఇది ఇక్కడిది కాదు, నార్త్ హీరోలు చేసే పనే ఆడో. అదే విధంగా ప్రభాస్ కల్కిలో వాడినట్లుగా ఆ వీడియో ను వైరల్ చేస్తూ.. ప్రభాస్ ను భారీగా ట్రోల్ చెయ్యడం ప్రభాస్ ఫ్యాన్స్ కు ఆగ్రహాన్ని తెప్పించింది. ప్రభాస్ క్రేజ్ ని తట్టుకోలేక ఇలాంటి వీడియోలను స్ప్రెడ్ చేస్తున్నారు, స్టార్స్ ఎవరైనా దూప్స్ ని వాడతారు, ప్రభాస్ దానికి అతీతం కాదు అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ సమాధానమిస్తున్నారు.