ByGanesh
Fri 29th Nov 2024 04:13 PM
మెగా హీరోలు హీరోయిన్స్ కాళ్ళు పట్టుకున్నారు, ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. మెగా హీరో అల్లు అర్జున్ పుష్ప ద రూల్ చిత్రంలో భార్య శ్రీవల్లి పాత్రధారి రష్మిక కాళ్ళు పట్టుకుని భార్య మాట వింటే ఎలా ఉంటుందో చూపిస్తాను అంటూ చెప్పిన డైలాగ్ పుష్ప చిత్రంలో హైలెట్ అయ్యింది. అదే అభిమానులకు షాకిచ్చింది.
ఇప్పుడు మరో మెగా హీరో రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ నానా హైరానా సాంగ్ లో తన హీరోయిన్ కియారా అద్వానీ కాళ్ళు పట్టుకున్న విజువల్ నానా హైరానా సాంగ్ లో కనిపించింది. వారి మధ్యన ఆ రొమాంటిక్ ఫోజ్ అభిమానులను ఇంప్రెస్ చేసింది. కియారా అద్వానీ కాలుని తాకుతూ రామ్ చరణ్ ఆ పాటలో స్టెప్స్ వేసాడు.
ప్రస్తుతం అల్లు అర్జున్-రష్మిక, రామ్ చరణ్-కియారా అద్వానీల పిక్స్ పెట్టి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మెగా హీరోలు హీరోయిన్స్ కాళ్లేలా పట్టుకున్నారో చూసారా అని కామెంట్స్ చేస్తున్నారు.
Mega heroes holding heroine leg:
Ram Charan touches Kiara legs in NaaNaa Hyraanaa song