Milton hurricane sucking water multiple killed over 1 million power outages | Milton update: హుదూద్‌ కంటే వంద రెట్ల విధ్వంసం సృష్టించిన మిల్టన్

Milton hurricane :అమెరికాలోని ఫ్లోరిడా తీరాన్ని మిల్టన్ హరికేన్ హడలెత్తించింది.  ఈ హరికేన్  కారణంగా   10 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.  హెలెన్ హరికేన్ రెండు వారాల క్రితం అమెరికాలో విధ్వంసం సృష్టించింది. ఇప్పుడు మిల్టన్ బారిన పడింది.  ఫ్లోరిడాలోని టంపా బేలో మిల్టన్ విధ్వంసం భయానకంగా ఉంది.   



మిల్టన్ హరికేన్ ముప్పును దృష్టిలో ఉంచుకుని ఫ్లోరిడా తీర ప్రాంతాలను ఖాళీ చేయించారు.  అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ దీనిని జీవన్మరణ సమస్యగా పేర్కొన్నారు. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఒక శతాబ్దానికి పైగా ఫ్లోరిడాను తాకిన అత్యంత వినాశకరమైన భూకంపం ఇదేనని  ప్రకటించారు.  

ఫ్లోరిడాలో మిల్టన్ సృష్టించిన విధ్వంసాన్ని చాలా మంది సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఫ్లోరిడాకు అందరి మద్దతు ఉండాలని కోరుతున్నారు. 



ఫ్లోరిడా చరిత్రలోనే ఇంత  విధ్వంసకరమైన హరికేన్ ను చూడలేదని ఎక్కువ మంది దృశ్యాలను షేర్ చేస్తున్నారు. 

ఇరవై లక్షల మంది ఈ తుపాన వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరెంట్ సౌకర్యాన్ని ఇప్పుడిప్పుడే పునరుద్ధరించడం అంత తేలికయ్యేలా లేదని అంచనా వేస్తున్నారు.  



ఫ్లోరిడాకోసం ప్రార్థించాలని అక్కడి ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. 

 

 

మరిన్ని చూడండి

Source link