Modi government is preparing to introduce a new Universal Pension Scheme to benefit all citizens of country | Universal Pension Scheme: దేశ ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్‌

Universal Pension Scheme: ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగం చేస్తున్న వాళ్లకు వచ్చినట్టుగానే 60 ఏళ్లు దాటిన ప్రతి పౌరుడికి పింఛన్ వచ్చేలా కొత్త స్కీమ్‌ తీసుకొచ్చేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. యూనివర్శల్ పెన్షన్ స్కీమ్‌ పేరుతో దీన్ని తీసుకురానుట్టు జాతీయ పత్రికలు రాస్తున్నాయి. 

ప్రభుత్వ, కొన్ని ప్రైవేటు రంగాల్లో పని చేసే వాళ్లకు ప్రతి నెల కొంత నగదు వారి శాలరీ నుంచి కట్ అవుతుంది. రిటైర్మెంట్‌ అంటే 60 ఏళ్ల తర్వాత దాన్ని ఆ వ్యక్తికి ఇస్తారు. ఇలాంటి సౌకర్యం చాలా రంగాల్లో పని చేస్తున్న వాళ్లకు లేదు. వారు రిటైర్మెంట్ అయిన తర్వాత మళ్లీ ప్రభుత్వాలపైనో లేకుంటే వారి కుటుంబ సభ్యులపైనో ఆధార పడాల్సి వస్తోంది. 

ఏదైనా సంస్థలో పని చేస్తున్నప్పుడు జీతం నుంచి 12 శాతం కట్ చేసి ఉద్యోగ భవిష్యనిధిలో అంటే ఈపీఎఫ్‌వోలో జమ చేస్తారు. అంతే మొత్తాన్ని ఆ కంపెనీ కూడా ఆ ఖాతాలో జమ చేస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం జమ చేస్తుంది. ప్రైవేటు ఉద్యోగులకు ప్రభుత్వం ఎలాంటి డబ్బులు జమ చేయదు. ఇది రిటైర్మెంట్ తర్వాత ఆ ఉద్యోగికి పింఛన్ రూపంలో ఇతర మార్గాల్లో ఇస్తారు. 

Also Read: విజయ్‌ని గెలిపిస్తా – పొలిటికల్ ధోనీ అవుతా – తమిళనాడు ఫీల్డ్ లోకి ప్రశాంత్ కిషోర్

ఇలాంటి వెసులుబాటును ఇతర రంగాల్లో పని చేసే వాళ్లకు అందడం లేదు. ముఖ్యంగా ఇంట్లో పని చేసే మహిళలకు, నిర్మాణ రంగంలో పని చేసే కార్మికులకు, గిగ్ వర్కర్లకు, చేతివృత్తి వాళ్లకు ఇలాంటి రంగాల్లో పని చేస్తున్న వాళ్లకు పింఛన్ సౌకర్యం ఉండటం లేదు. దీని కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అటల్‌ పెన్షన్‌ యోజన, ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్‌దాన్‌ యోజన, ప్రధానమంత్రి కిసాన్‌ మాన్‌దాన్‌ యోజన పేరుతో కొన్ని వర్గాలకు ఇలాంటి సౌకర్యం కల్పిస్తోంది. 

ఎన్ని చేసినప్పటికి కూడా ఇంకా కొన్ని వర్గాలకు న్యాయం జరగడం లేదు. అందకే మూకుమ్మడిగా అందరి పౌరులకు వర్తించేలా ఓ యూనివర్శల్ పెన్షన్ స్కీమ్ తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. దీనికి సంబంధించిన విధి విధానాలను రూపొందిస్తోంది. ఇప్పటికే వివిధ వర్గాలకు అందిస్తున్న పింఛన్‌ పథకాలను ఇందులో విలీనం చేస్తారు. National Pension Scheme మాత్రం అలానే కొనసాగుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

కేంద్రం ఇప్పటికి కూడా కొన్ని వర్గాలకు పింఛన్ స్కీమ్‌లను అందిస్తోంది. అటల్‌ పెన్షన్ యోజన ద్వారా 60 ఏళ్లు దాటిన పౌరులకు వెయ్యి నుంచి పదిహేను వందల రూపాయలు పింఛన్ ఇవ్వనున్నారు. ప్రధానమంత్రి శ్రమ్‌ యోగి మాన్‌ధన్‌ యోజన్ (PM-SYM) వీధి వ్యాపారులు, ఇళ్లలో పని చేసే లాంటి వాళ్ల కోసం పని చేస్తోంది. రైతులను ఉద్దేశించి అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్‌ మాన్‌దాన్‌ యోజన ద్వారా రైతు అరవై ఏళ్లు దాటితే  నెలకు మూడు వేలు ఇవ్వనున్నారు. వీటన్నింటినీ కొత్తగా తీసుకొచ్చే యూనివర్శల్‌ పెన్షన్ స్కీమ్‌లో మెర్జ్ చేయనున్నారు. 

Also Read: బట్టలేసుకోని బ్రెజిల్ ఇన్‌ఫ్లూయర్లు చీర కట్టుకున్న భారత మహిళను ఎగతాళి చేశారు – నెటిజన్లు ఊరుకుంటారా?

మరిన్ని చూడండి

Source link