Monalisa News: యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాకు కోట్ల మంది భక్తులు వచ్చారు. వేలల్లో సెలబ్రెటీలు కూడా వచ్చి పుణ్యస్నానాలు చేశారు. వ్యాపారవేత్తలు కూడా తరలి వచ్చారు. వాళ్లందర్నీ వెనక్కి నెట్టేసిన ఓ యువతి టాక్ ఆఫ్‌ది కుంభమేళా అయిపోయారు. మత్తెక్కించే కళ్లతో, పెదాలపై చిరునవ్వుతో యావత్ దేశాన్నే ఆమె చుట్టూ తిప్పుకుంది. ఆమె మోనాలిసా.
వృత్తి రీత్యా ఆమె కుటుంబం పూసల దండలు అమ్ముకుని జీవించేది. కుంభమేళా టైంలో వ్యాపారం బాగా అవుతుందని ప్రయాగ్‌రాజ్ వచ్చారు. కుటుంబంతో కలిసి మోనాలిసా కూడా వచ్చింది. అలా వచ్చి పూసల దండలు, రుద్రాక్షలు అమ్ముకుంటున్న ఆమె సోషల్ మీడియా దృష్టిని ఆకర్షించింది.
ఒక్కసారిగా ఆమె చిరునవ్వు, కళ్లు చూసి యావత్ దేశం ఆమె మాయలో పడిపోయారు. ఒక్కరాత్రిలోనే మోనాలిసా నేషనల్ ఫేమస్ అయిపోయారు. ఎంతలా అంటే చివరకు ఆమె వ్యాపారం చేసుకోలేకపోయారు. ఆమెతో ఫొటోలు దింగేందుకు భక్తులు, ఇంటర్వ్యూల కోసం మీడియా ఎగబడింది. ప్రయాగ్‌రాజ్‌లో మొత్తం క్రౌడ్‌ను ఎఫక్టివ్‌గా అప్పటి వరకు కంట్రోల్ చేసిన పోలీసులు ఈమె వద్దకు వచ్చే వారిని మాత్రం కంట్రోల్ చేయలేకపోయారు.
Also Read: భద్రత కారణాలతో కుంభమేళా నుంచి వెళ్లిపోయిన మోనాలిసా – తీవ్ర ఇబ్బందులకు గురయ్యానంటూ వీడియో
మోసాలిసా ఎక్కడ ఉంటే అక్కడకు వచ్చే జనంతో న్యూసెన్స్ క్రియేట్ అయ్యింది. పోలీసులకు ఏం చేయాలో అర్థం కాకపోవడంతో ఆమెను అక్కడి నుంచి పంపేశారు. దీంతో వ్యాపారం బాగా సాగుతుందని వచ్చిన మోనాలిసా ఫ్యామిలీ ఖాళీ చేతులతోనే తిరుగుముఖం పట్టారు. ఇలా వ్యాపారం సాగకపోవడంతో నిరాశగా ఇంటికి వెళ్లిపోయిన మోనాలిసాకు అదృష్టం వెంటాడింది.
ఓవర్ నైట్ స్టార్‌గా ఎదిగిన మోనాలిసా అందానికి యువతరమే కాదు దర్శకులు, సినీ ప్రముఖులు కూడా ఫిదా అయిపోయారు. ఆమె ఓకే అంటే సినిమాల్లో ఛాన్స్‌లు ఇస్తామంటూ ఆమె వెంట పడ్డారు. అలాంటి వారిలో బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా ఒకరు. అలా చెప్పడమే కాదు ఇప్పుడు దాన్ని నిజం చేశారు. ఆయన తీయబోతున్న ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’లో ఆమెను తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఈమేరకు మోనాలిసాను ఆమె ఫ్యామిలీని ఒప్పించినట్టు తెలుస్తోంది. ఈమేరకు ఆమెతో కలిసి దిగిన ఓ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
आपका बहुत बहुत धन्यवाद सर, एक छोटे शहर की लड़की को मौका देने के लिए
‘द डायरी ऑफ मणिपुर’ फिल्म में लीड रोल देने के लिए @SanojMishra12 🙏 pic.twitter.com/YttXgGfdtV
— Monalisa Bhosle (@MonalisaIndb) January 30, 2025
మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లా మహేశ్వర్‌లోని ఉంటున్న మోనాలిసాను డైరెక్టర్ సనోజ్ మిశ్రా కలిశారు. తండ్రితో మాట్లాడి ఒప్పించారు. ఆయనకు ఉన్న అనుమానాలు క్లారిఫై చేశారు. దీంతో సినిమాలో నటించేందుకు ఆమెతో సంతకాలు తీసుకున్నారు. త్వరలోనే ఆమెకు ముంబైలో ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఏప్రిల్ నుంచి ప్రారంభంకానుంది. వచ్చే అక్టోబర్‌లో ఈ సినిమాను విడుదలకు సిద్ధం చేస్తున్నారు.
Also Read: అప్పు చేసి మరీ సొంతూరికి వెళ్లి మోనాలిసా – సినిమాల్లో అవకాశాలపైనా స్పందించిన ఓవర్ నైట్ స్టార్
మరిన్ని చూడండి