Most Controversial Film: ప్రపంచ సినిమా చరిత్రలో ఎన్నో వివాదాస్పద సినిమాలు ఉంటాయి. అయితే వాటిలో నెంబర్ వన్ సినిమా మాత్రం ఒకటి ఉంది. దాన్ని 150 దేశాల్లో నిషేధించారు. చివరికి ఆ దర్శకుడ్ని కూడా చంపేశారు.
ఈ అత్యంద వివాదాస్పద సినిమాపేరు సాలో. కొన్ని భాషల్లో దీన్ని 120 డేస్ ఆఫ్ సొదొమ్ అనే పేరుతో రిలీజ్ చేయాలనుకున్నారు. మొదట ఇటాలియన్ భాషలో రూపొందించి విడుదల చేశారు. అయితే ఆ తర్వాత ఈ సినిమా సృష్టించిన ప్రకంపనల కారణంగా 150 దేశాలలో నిషేధించారు. సినిమా విడుదలైన కొద్ది రోజులకు ఈ సినిమా నిర్మాత, దర్శకుడు పియర్ పాలో పసోలిని దారుణంగా చంపేశారు.
1975లో విడుదలైన ఈ చిత్రం పూర్తిగా పొలిటికల్ కథతో ఉంటుంది. మార్క్విస్ డి సేడ్ అనే ప్రసిద్ధ రచయిత రాసిన నవల ” ది 120 డేస్ ఆఫ్ సోడోమ్” ఆధారంగా తెరకెక్కించారు. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో సాగే ఈ కథ ఈ సినిమా అంతా ఉటుంది. నలుగురు ధనవంతులు, అవినీతిపరులు కలిసి 18 మంది యువకులు, మహిళలను కిడ్నాప్ చేసి నాలుగు నెలల పాటు శారీరకంగా, మానసికంగా హింసించడమే సినిమా కథ. నాజీలు యువతీ, యువకులను ఎలా హింసించారో.. ఈ చిత్రంలో చూపించారు. లైంగిక వేధింపులు, శాడిజం, క్రూరమైన హింస , హత్య చేయడం వంటి హింసాత్మక దృశ్యాలు సినిమా అంతా ఉంటాయి.
Also Read: ఆ చిన్న గ్రామంలో అందరూ యూట్యూబర్లే – బయటకు వెళ్లకుండా లక్షల సంపాదిచేస్తున్నారు !
అందుకే ఈ సినిమా ఇప్పటికీ అత్యంత వివాదాస్పద సినిమాగా నిలిచింది. ఈ సినిమా ప్రింట్ దాదాపుగా ఎక్కడా దొరకదు.
Also Read: బట్టలేసుకోని బ్రెజిల్ ఇన్ఫ్లూయర్లు చీర కట్టుకున్న భారత మహిళను ఎగతాళి చేశారు – నెటిజన్లు ఊరుకుంటారా?
మరిన్ని చూడండి