Mukesh Ambani One Day Income: రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ & ఎండీ అయిన ముకేష్ అంబానీ (Mukesh Ambani, Chairman & MD of Reliance Industries) భారతదేశంలో మాత్రమే కాదు, ఆసియాలోనే అత్యంత ధనవంతుడు. ముకేష్ అంబానీ నెట్‌వర్త్ (సంపద విలువ) సుమారు 116 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా వేశారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, రిలయన్స్ ఛైర్మన్ ప్రపంచంలో 12వ అత్యంత సంపన్న వ్యక్తి. అతని తర్వాత, అదానీ గ్రూప్ ఓనర్ గౌతమ్ అదానీ (Gautam Adani) 13వ ర్యాంక్‌లో ఉన్నారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, అంబానీ నికర విలువ 104 బిలియన్ డాలర్లు.
భారతదేశంలో అత్యంత ధనవంతుడు ముకేష్ అంబానీ గంటకు ఎంత సంపాదిస్తున్నారో మీరు ఎప్పుడైనా ఆలోచించారా?. ఆయన రోజు సంపాదన ఎంతో మీకు తెలుసా?
ముకేష్ అంబానీ రోజు సంపాదన ఇది
ముకేష్ అంబానీ సంపదను అంచనా వేయడానికి ఒక లెక్క ఉంది. ఒక వ్యక్తి, ప్రతి సంవత్సరం రూ. 4 లక్షలు సంపాదిస్తే, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ప్రస్తుత సంపద స్థాయికి చేరుకోవడానికి అతనికి 1.74 కోట్ల సంవత్సరాలు పడుతుంది. ఇది ఆశ్యర్యం కలిస్తున్నా, ఇదే నిజం.
గతంలో, ముకేష్ అంబానీ ప్రతి సంవత్సరం దాదాపు 15 కోట్ల రూపాయల జీతం తీసుకునేవారు. కానీ, కరోనా నుంచి జీతం తీసుకోకుండానే పని చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఆయన రోజుకు సగటున రూ.163 కోట్లు సంపాదిస్తున్నారు. గంటకు దాదాపు 6.80 కోట్లు ఆర్జిస్తున్నారు. అంటే, అంబానీ తన ఇంట్లో ప్రశాంతంగా నిద్ర పోతున్నప్పటికీ, ప్రతి గంటకూ ఆయన సంపద విలువ 6.80 కోట్లు పెరుగుతుంది. కరోనా కాలం నుంచి జీతం లేకపోతే అంబానీకి ఇంత డబ్బు ఎలా వస్తుంది?. ఈ డబ్బు అతనికి రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో వాటాల నుంచి వస్తుంది. పెట్రో కెమికల్, ఆయిల్, టెలికాం, రిటైల్ వంటి చాలా రంగాల్లోకి రిలయన్స్ ఇండస్ట్రీస్ విస్తరించింది, పదుల సంఖ్యలో వ్యాపారాలు ఉన్నాయి. ఇది కాకుండా, ముంబైలోని సొంత ఇల్లు యాంటిలియాతో సహా రియల్ ఎస్టేట్‌లో ముకేష్ అంబానీ చాలా పెట్టుబడులు పెట్టారు. యాంటిలియా విలువ దాదాపు రూ.15,000 కోట్లు ఉంటుందని అంచనా.
2020 నాటికి ప్రతి గంటకు రూ.90 కోట్ల సంపాదన
2020 నాటికి ముకేష్ అంబానీ ప్రతి గంటకు సగటున రూ.90 కోట్లు సంపాదించేవారట. అంటే, రోజుకు 2,160 కోట్ల ఆదాయం. మరోవైపు, భారతదేశంలో దాదాపు 24 శాతం మంది ప్రజలు నెలకు కేవలం 3000 రూపాయలు మాత్రమే సంపాదించగలుగుతున్నారు.
అంబానీ కుటుంబ కార్యక్రమాలు కూడా వారి హోదాకు తగ్గట్టుగానే ఉంటాయి. ఈ ఏడాది, తన చిన్న కొడుకు అనంత్ అంబానీ పెళ్లి కోసం దాదాపు రూ.5000 కోట్లు వెచ్చించి యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు ముకేష్ అంబానీ. ఈ పెళ్లికి సంబంధించిన ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్ కార్యక్రమాలు కూడా ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచాయి. ఇటీవల, సుమారు రూ. 1000 కోట్లు ఖర్చు పెట్టి బోయింగ్ 737 మ్యాక్స్ లగ్జరీ విమానాన్ని తన కోసం కొనుగులు చేశారు.
మరో ఆసక్తికర కథనం: స్టాక్ మార్కెట్ ఢమాల్ – సెన్సెక్స్ 1200 పాయింట్లు, నిఫ్టీ 350 డౌన్
మరిన్ని చూడండి