Mysterious Dinga Dinga virus outbreak in Uganda It causes uncontrollable shaking

Dinga Dinga : కరోనా వచ్చి, వెళ్లిపోయినప్పట్నుంచి అనేక రకాల వైరస్ మనపై దాడి చేస్తూనే ఉన్నాయి. కొన్నింటికైతే ఇప్పటికీ వ్యాక్సిన్స్ కూడా లేవు. కరోనాతో ఎలాగోలా బయటపడ్డాం అనుకునే లోపే ఇప్పుడు మరో మిస్టీరియస్ వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే 300మందిని ప్రభావితం చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఎక్కువగా మహిళలే ఈ వైరస్ బారిన పడుతుండడం గమనార్హం. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఆఫ్రికా దేశమైన ఉగాండాలో ఇప్పుడు ఈ డేంజరస్ వైరస్ దావానంలా వ్యాప్తి చెందుతోంది. అక్కడి ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోన్న ఈ వైరస్ పేరు డింగా డింగా(Dinga Dinga). ఇది ఎక్కువగా బండిబుగ్యో జిల్లాలో తీవ్ర కలకలం సృష్టిస్తోంది. అక్కడ ఇప్పటికే 300 మంది ఈ వైరస్ బారిన పడడం మరింత భయాన్ని రేకెత్తిస్తోంది. ఈ వైరస్ సోకినవాళ్లు డ్యాన్స్ చేసినట్టు ఊగిపోతున్నారట. అంటే బాగా షేక్ అవుతున్నారన్నమాట. ముఖ్యంగా ఇది మహిళలు, బాలికల్ని లక్ష్యంగా చేసుకుంటోంది. వారంతా ఎందుకు ఊగుతున్నారో ఇప్పుడు అంతుచిక్కని రహస్యంగా మారింది.

ఇక డింగా డింగా వైరస్ లక్షణాల విషయానికొస్తే..

  • ఈ వైరస్ వచ్చిన వాళ్లకు జ్వరం ఉంటుంది.
  • వణుకుతున్నట్లుగా బాడీ మొత్తం షేక్ అవుతూ ఉంటుంది.
  • ఎక్కడ ఉన్నవారు అక్కడే ఉండి, ఊగుతున్నారు. అక్కడి నుంచి కదలలేకపోతున్నారు. శరీరం తమ కంట్రోల్ లో లేకుండా పోతుంది.
  • జ్వరంతో పాటు శరీరం వణుకు, విపరీతమైన బలహీనత.
  • తీవ్రమైన సందర్భాల్లో, అక్కడి ప్రజలు పక్షవాతం కూడా ఎదుర్కొంటున్నారు.

స్థానిక మీడియా ప్రకారం, వ్యాధి సోకిన వారి శరీరం అనియంత్రితంగా వణుకుతున్నందున నడవడం కూడా కష్టంగా మారుతోంది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన ఉగాండాలోని ఆరోగ్య అధికారులు ఈ మిస్టరీ వైరస్, దానికి కారణమేమిటన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ వైరస్ వల్ల ఇప్పటివరకు ఎటువంటి మరణాలు సంభవించనప్పటికీ, ఆరోగ్య అధికారులు ముందస్తు నివారణలు, జాగ్రత్తల ప్రాముఖ్యతను నొక్కి చెబుతున్నారు. రోగులు సాధారణంగా వారంలో కోలుకుంటారని జిల్లా ఆరోగ్య అధికారి డాక్టర్ కియిటా క్రిస్టోఫర్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి, పరిశుభ్రతను పాటించాలని, ప్రభావిత వ్యక్తులతో సంబంధాన్ని నివారించాలని, కొత్త కేసులను వెంటనే స్థానిక ఆరోగ్య బృందాలకు నివేదించాలని ఆరోగ్య అధికారులు సిఫార్సు చేస్తున్నారు. బండిబుగ్యో వెలుపల ఎటువంటి కేసులు నమోదు కాలేదని డాక్టర్ కియిటా ధృవీకరించారు. మరింత విశ్లేషణ కోసం బాధిత వ్యక్తుల నుండి నమూనాలు ఉగాండా ఆరోగ్య మంత్రిత్వ శాఖకు పంపారు. అయితే అధికారిక నిర్ధారణకు ఇంకా సమయం వేచి ఉంది.

ఫ్రాన్సులోని స్ట్రాస్‌బర్గ్‌లో 1518లో “డ్యాన్సింగ్ ప్లేగు” అనే పేరుతో తాండవం చేసిన వైరస్ డింగా డింగా వైరస్ ను పోలి ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ఒకే రకమైన లక్షణాలను కూడా ఎదుర్కొంటున్నారు. ఈ వైరస్ సోకిన రోగులు అప్పడు గంటల తరబడి అనియంత్రితంగా వణుకుతూ కనిపించారు. కొన్ని తీవ్ర సందర్భాల్లో కొందరు ప్రాణాలను సైతం వదిలేయాల్సి వచ్చింది

వ్యాక్సిన్ ఉందా?

“ఈ వైరస్‌కి ఇప్పటివరకూ మెడిసిన్, వ్యాక్సిన్ ఏదీ లేదు. కొన్ని రకాల పద్ధతుల్లో ప్రయత్నిస్తుంటే ఓ వారం తర్వాత పేషెంట్లు కోలుకుంటున్నారు. ఎవరికైనా ఈ వైరస్ సోకితే వెంటనే స్థానిక ఆరోగ్య కేంద్రాలూ, ఆస్పత్రులకు వెళ్లాలి” అని కియిటా కోరారు.

కాంగోలో మరో వ్యాధి:

ఉగాండాలో వైరస్ సంగతే ఇంకా తేలలేదు. మరోవైపు ఆఫ్రికాలోని డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో (DRC)లో మరో రకమైన వ్యాధి ప్రబలుతోంది. అదేంటో కూడా ఎవరికీ అర్థం కావట్లేదు. అది ఇప్పటికే 400 మందికి సోకిందని, ఓకేచోట 394 కేసులు నమోదవ్వగా.. 30 మంది చనిపోయారని ప్రపంచ ఆరోగ్యం సంస్థ (WHO) చెప్పింది.

 

మరిన్ని చూడండి

Source link