Naga Chaitanya and Sai Pallavi Remuneration తండేల్ తారల పారితోషికాలు


Tue 04th Feb 2025 08:55 PM

naga chaitanya  తండేల్ తారల పారితోషికాలు


Thandel – Naga Chaitanya and Sai Pallavi Remuneration తండేల్ తారల పారితోషికాలు

చందు మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య-సాయి పల్లవి కాంబోలో తెరకెక్కిన తండేల్ చిత్రం మరో రెండు రోజుల్లో విడుదల కాబోతుంది. డిసెంబర్, సంక్రాంతి అంటూ తండేల్ ఫైనల్ గా ఫిబ్రవరి 7 కి చేరింది. ఒరిజినల్ కథ అంటే 50 శాతం రియాలిటీ అయితే, మిగిలిన 50 శాతంను కల్పితంగా తండేల్ కథ ఉండబోతుంది. 

నాగ చైతన్య, సాయి పల్లవి ప్రాణం పెట్టి సినిమా చెయ్యడమే కాదు ప్రమోషన్స్ లోను అంతే హడావిడి చేస్తున్నారు. సినిమాలోనూ చైతు-సాయి పల్లవిల కెమిస్ట్రీ ఫుల్ గా వర్కౌట్ అవ్వడం పక్కాగా ఉంది. మరి తండేల్ రాజా గా నాగ చైతన్యకు అల్లు అరవింద్ గారు ఇచ్చిన పారితోషికం ఎంతో తెలుసా.. అక్షరాలా 15 కోట్లు నాగ చైతన్య తండేల్ చిత్రానికి అందుకున్నట్టుగా తెలుస్తోంది. 

ఇక లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి కి అయితే షాకిచ్చే పారితోషికాన్ని సెట్ చేసారు మేకర్స్. బుజ్జి తల్లి పాత్రకు గాను సాయి పల్లవి అత్యధిక పారితోషికం అంటే దాదాపుగా 5 కోట్లు తండేల్ చిత్రానికి పుచ్చుకుందట. మరి టాలీవుడ్ లో ఏ హీరోయిన్ ఇప్పటివరకు ఇంత అందుకుని ఉండరేమో అనే చర్చ సోషల్ మీడియాలో స్టార్ట్ అయ్యింది. 


Thandel – Naga Chaitanya and Sai Pallavi Remuneration:

Naga Chaitanya and Sai Pallavi remunerations for Thandel 





Source link