ByGanesh
Fri 29th Mar 2024 08:26 PM
డీజే టిల్లు అంటూ యూత్ లో చెరగని ముద్ర వేసి సిద్దు బాయ్ గా క్రేజ్ సంపాదించుకున్న సిద్దు జొన్నలగడ్డ దానికి సీక్వెల్ గా చేసిన టిల్లు స్క్వేర్ లో డీజే టిల్లు లో ఉన్న రొమాన్స్ కి డబుల్ డోస్ ఇస్తూ యూత్ ని మరోసారి పడేసే ప్లాన్ చేసాడు. డీజే టిల్లు లో రాధికా ఉరఫ్ నేహా శెట్టితో ఘాటు రొమాన్స్ చేసిన సిద్దు టిల్లు స్క్వేర్ లో అనుపమ పరమేశ్వరన్ తో మరింతగా రెచ్చిపోయి రొమాన్స్ చేసాడు. అప్పట్లో రాధికా-టిల్లు రొమాన్స్ ఎంతగా సెన్సేషన్ అయ్యింది.. ఇప్పుడు టిల్లు స్క్వేర్ పోస్టర్ తోనే అంత సెన్సేషన్ క్రియేట్ చేసారు.
నేడు విడుదలైన టిల్లు స్క్వేర్ మళ్ళీ యూత్ ని టార్గెట్ చేసింది. ఈచిత్రం మొదటి షోకే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అసలు టిల్లు స్క్వేర్ హిట్ అవడానికి మెయిన్ రీజన్ సిద్దు జొన్నలగడ్డ వన్ మ్యాన్ షో. టిల్లు క్యారెక్టర్ కోసం ఓ పెక్యులియర్ అప్పీయరెన్స్ డిజైన్ చేసుకున్న సిద్దు ఆ పాత్ర ప్రవర్తన, పలికే డైలాగ్స్ పట్ల కూడా ఎంత కేర్ తీసుకుంటున్నాడో స్క్రీన్ పై స్పష్టంగా తెలుస్తోంది. మొదటి నుంచి చెప్పుకున్నట్టుగానే అనుపమ లుక్స్, ఆమె గ్లామర్ హైలెట్ అనేలా ఉన్నాయి. నేహా శెట్టి కొద్దిసేపు మెరుపులు మెరిపించింది.
సాంకేతికంగా రామ్ మిరియాల – అచ్చు రాజమణి అందించిన పాటలు సినిమా ఫ్లో లో పర్ ఫెక్ట్ గా మెర్జ్ అవ్వగా, భీమ్స్ నేపథ్య సంగీతం కథనానికి కరెక్టుగా అమరింది. టిల్లు స్క్వేర్ కి అన్నివైపులా నుంచి పాజిటివ్ రిపోర్ట్స్ రావడంతో మేకర్స్ సక్సెస్ సెలెబ్రేషన్స్ చేసుకుంటూ కేక్ కట్ చేసారు. ఈ చిత్రం 100 ఓట్లు కలెక్ట్ చెయ్యడం పక్కా అంటూ నిర్మాత నాగవంశీ ధీమా వ్యక్తం చేసారు. అదే సెలెబ్రేషన్స్ లో టిల్లు 3 కూడా అనౌన్స్ చేస్తామంటూ నిర్మాత నాగ వంశి ప్రకటించాడు. అంటే మరోసారి టిల్లుగాని కామెడీ కోసం వెయిట్ చేసేలా ఈ అనౌన్సమెంట్ ఉంది.. అంటూ సిద్దు అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు.
Naga Vamsi about Tillu 3:
Naga Vamsi Confirms 3rd Part in Tillu Franchise