Nalgonda News : భలే దొంగలు..! భక్తుల వేషంలో రెక్కీ, రాత్రివేళ ఆలయాల్లో చోరీలు

పగటిపూట భక్తుల వేషం

పగటి పూట భక్తుల వేషం గట్టి టార్గెట్ పెట్టుకున్న దేవాలయానికి వెళ్లి రెక్నీ చేయడం, రాత్రి పూట హుండీలను కొల్లగొట్టం పనిగా పెట్టుకున్న కత్తుల యాదయ్య, కత్తుల శివ అనే దొంగలు 14 దేవాలయాల్లో చోరీలు చేశాక పట్టుబడ్డారు. నల్గొండ రూరల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో 3, కనగల్ మండలంలో3, నార్కెట్ పల్లి మండలంలో 2 దేవాలయాల్లో హుండీలను బద్దలు కొట్టారు. ఇంకా.. మునుగోడు, తిప్పర్తి, వేములపల్లి, చండూర్, కట్టంగూర్, హాలియా పోలీస్ స్టేషన్ల పరిధిలోనూ ఒక్కో దేవాలయంలో చోరీలు చేశారు. 

Source link