narcotics 300 Kg Drugs Worth Rs 1800 Crore Seized Near Gujarat Coast

గాంధీనగర్ గుజరాత్ తీరంలో 300 కిలోల మాదకద్రవ్యాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ. 1800 కోట్లు ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఏప్రిల్ 12, 13 తేదీలలో రాత్రులలో గుజరాత్ ATS తో కలిసి భారత తీర రక్షక దళం (ICG) చేసిన ఆపరేషన్‌లో పెద్ద ఎత్తున డ్రగ్స్‌ను  స్వాధీనం చేసుకుంది. ICG నౌకను గుర్తించగానే నిందితులు contraband ను విసిరి, అంతర్జాతీయ సముద్ర జలాల సరిహద్దును దాటి పారిపోయారు.

ఇటీవల ఏప్రిల్ 10న బంగాళాఖాతంలో అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆరోపణలు రావడంతో చేపల వేటకు వెళ్లిన ఓ పడవను భారత తీర రక్షక దళం అదుపులోకి తీసుకుంది. 
అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖ (IMBL) లో ICG నౌక వరాద్ పెట్రోలింగ్ చేస్తుండగా అనుమానాస్పద కదలికలు ఉన్నట్లు గుర్తించారు. చేపల వేటకు వినియోగించే ఓడలో ఏదో లోడింగ్ జరిగిందని, అక్కడ అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నాయని అప్రమత్తం అయ్యారు.

అధికారులు తక్షణం రంగంలోకి దిగి ఆ ఓడలో 50 నుండి 60 కిలోగ్రాముల బరువున్న దాదాపు 450 సంచులు తరలిస్తున్నట్లు భారత కోస్ట్ గార్డ్స్ కనుగొన్నారు. మార్కెట్ విలువ దాదాపు రూ. 1 కోటిగా ఉంటుందని అధికారిక ప్రకటనలో తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లోని Kakdwip ఫిషింగ్ హార్బర్ పేరిట ఆ బోడ్ రిజిస్టర్ అయి ఉంది. కానీ చెల్లుబాటు అయ్యే పత్రాలు లేకుండా పడవ నడుపుతున్నారని అధికారులు గుర్తించారు. పడవలో ఉన్న 14 మంది భారతీయులలో ఎవరి వద్ద గుర్తింపు కార్డులు లేవు. 

తాము ఐదు రోజులుగా సముద్రంలో ఉన్నట్లు సిబ్బంది చెప్పారు. కానీ పడవలో చేపలు పట్టేందుకు వినియోగించే పరికరాలు గానీ, చేపలు కూడా కనిపించలేదు. దాంతో ఆ బోటు ద్వారా డ్రగ్స్ లాంటివి అక్రమంగా సముద్రం ద్వారా విక్రయాలు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. 

భారత తీర రక్షక దళం ఆ పడవలోని సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. ఆ పడవను సీజ్ చేసి చట్ట ప్రకారం కేసు నమోదు చేసి చర్యలు చేపట్టార. విచారణ కోసం పారదీప్ పోర్టుకు తరలించినట్లు సమాచారం. సముద్ర జలాలకు సంబంధించిన చట్టాల ఆధారంగా చర్యలు చేపట్టారు.

మరిన్ని చదవండి

మరిన్ని చూడండి

Source link