National Aluminium Company Ltd Notification: భువనేశ్వర్‌లోని నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (NALCO) నాన్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు జనవరి 21లోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ పరీక్షల ఆధారంగా ఎంపికచేస్తారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది.
వివరాలు..
* నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
ఖాళీల సంఖ్య: 518
1) ఎస్‌యూపీటీ (జేఓటీ)- ల్యాబొరేటరీ: 37 పోస్టులు
2) ఎస్‌యూపీటీ (జేఓటీ)- ఆపరేటర్: 226 పోస్టులు
3) ఎస్‌యూపీటీ (జేఓటీ)- ఫిట్టర్: 73 పోస్టులు
4) ఎస్‌యూపీటీ (జేఓటీ)- ఎలక్ట్రికల్: 63 పోస్టులు
5) ఎస్‌యూపీటీ (జేఓటీ)- ఇన్స్ట్రుమెంటేషన్ (ఎంఆర్)/ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ (ఎస్పి): 48 పోస్టులు
6) ఎస్‌యూపీటీ (జేఓటీ)- జియాలజిస్ట్: 4 పోస్టులు
7) ఎస్‌యూపీటీ (జేఓటీ)- హెచ్ఈఎంఎం ఆపరేటర్: 9 పోస్టులు
8) ఎస్‌యూపీటీ (ఎస్ఓటీ)- మైనింగ్: 1 పోస్టు
9) ఎస్‌యూపీటీ (జేఓటీ)- మైనింగ్ మేట్: 15 పోస్టులు
10) ఎస్‌యూపీటీ (జేఓటీ)- మోటార్ మెకానిక్: 22 పోస్టులు
11) డ్రస్సర్-కమ్- ఫస్ట్ ఎయిడర్ (డబ్ల్యూ2 గ్రేడ్): 5 పోస్టులు
12) ల్యాబొరేటరీ టెక్నీషియన్ గ్రేడ్-III (పీఓ గ్రేడ్): 2 పోస్టులు
13) నర్స్ గ్రేడ్-III (పీఏ గ్రేడ్): 7 పోస్టులు
14) ఫార్మసిస్ట్ గ్రేడ్-III (పీఏ గ్రేడ్): 6 పోస్టులు
అర్హత: పోస్టును అనుసరించి 10వ తరగతి, ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. (లేదా) సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి: 21.01.2025 నాటికి డ్రస్సర్-కమ్- ఫస్ట్ ఎయిడర్/ల్యాబొరేటరీ టెక్నీషియన్/ నర్సు/ ఫార్మసిస్ట్ పోస్టులకు 35 సంవత్సరాలు; ఎస్‌యూపీటీ(ఎస్ఓటీ)- మైనింగ్ పోస్టులకు 28 సంవత్సరాలు; ఇతర పోస్టులకు 27 సంవత్సరాలకు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.100. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ ఎక్స్-సర్వీస్మెన్లకు మినహాయింపు ఉంది.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్యమైన తేదీలు…
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 31.12.2024.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 21.01.2025.
ALSO READ:
SBI JA Jobs: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు – తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జూనియర్ అసోసియేట్ (క్లరికల్ కేడర్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. దేశవ్యాప్తంగా ఎస్బీఐ శాఖల్లో మొత్తం 13,735 ఖాళీలను భర్తీ చేయనున్నారు. డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. వీటిలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ సర్కిల్లో 342; అమరావతి సర్కిల్లో 50 పోస్టులు కేటాయించారు. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ డిసెంబరు 17న ప్రారంభంకాగా.. సరైన అర్హతలున్న అభ్యర్థులు జనవరి 7 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.750 చెల్లిస్తారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెలకు నెలకు రూ.26,730 వరకు జీతంగా చెల్లిస్తారు.
నోటిఫికేషన్, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని చూడండి